UGC NET 2024:నెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మరోసారి వాయిదా పడిన పరీక్ష

యూజీసీ నెట్ 2024 ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక అప్‌డేట్ ఇచ్చింది.

Update: 2024-08-14 10:25 GMT

దిశ,వెబ్‌డెస్క్:యూజీసీ నెట్ 2024 ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల (ఆగస్టు) 26న జరగాల్సిన పరీక్షను మరుసటి రోజు 27కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 26వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షను రీషెడ్యూల్ చేసినట్టు వివరించింది. ఈ క్రమంలో రీ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరిచింది. కాగా యూజీసీ నెట్ పరీక్షలు ఆగస్టు 21 ప్రారంభమై సెప్టెంబర్ 4 వరకు కొనసాగనున్నాయి. ఆగస్టు నెలలో 21, 22, 23, 27 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు, షెడ్యూల్‌కు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 011-40759000 లేదా ugcnet@nta.ac.in ఈ-మెయిల్‌ను అభ్యర్థులు సంప్రదించవచ్చునని సూచించింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ ugcnet.nta.ac.in ను సందర్శించండి.

Tags:    

Similar News