APRS CAT - 2023 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 134 ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలు, ఆరు,ఏడు, ఎనిమిది తరగతుల్లో

Update: 2023-04-05 17:11 GMT

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 134 ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలు, ఆరు,ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. దీనికి సంబంధించిన ఏపీఆర్ఎస్ క్యాట్ -2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షను మే 20న నిర్వహించనున్నారు.

వివరాలు :

ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023

క్లాసులు: 5,6,7,8 తరగతులు.

50 పాఠశాలల్లో 5వ తరగతి సీట్లు: 3,920

84 పాఠశాలల్లో 6,7,8 తరగతుల సీట్లు: 356

అర్హత: 2022-23 విద్యా సంవత్సరంలో 5,6,7,8 తరగతులకు ప్రవేశం పొందడానికి వరుసగా 4,5,6,7 తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించరాదు.

దరఖాస్తు :ఆన్‌లైన్ లో చేయాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, స్పెషల్ కేటగిరి, స్థానికత ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 100 చెల్లించాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 24, 2023.

పరీక్ష తేదీ: మే 20, 2023.

వెబ్‌సైట్: https://aprs.apcfss.in

Tags:    

Similar News