AP DEECET 2024 Exam:రేపే ఏపీ డీఈఈసెట్‌ 2024 రాత పరీక్ష..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ డీఈఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే.

Update: 2024-05-23 03:43 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ డీఈఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను మే 24న నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఏపీ డీఈఈసెట్‌ 2024 పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 4,949 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌తో ఫొటో రానివారు ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వెంట తీసుకురావాలని సూచించారు.


Similar News