అలర్ట్ :ఎగ్జామ్ హాల్‌లో ఇలా చేశారో.. అడ్డంగా బుక్ అవుతారు జాగ్రత్త!
పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ఎగ్జామ్స్ అంటే చాలా టెన్షన్ పడటం లేదా భయపడుతుంటారు.అయితే పరీక్షహాల్‌లో విద్యార్థులు ఈ తప్పులు చేయకూడదు.
దిశ, వెబ్‌డెస్క్ : పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ఎగ్జామ్స్ అంటే చాలా టెన్షన్ పడటం లేదా భయపడుతుంటారు.అయితే పరీక్షహాల్‌లో విద్యార్థులు ఈ తప్పులు చేయకూడదు. ఒక వేళ తెలిసి తెలియక ఈ చిన్న చిన్న తప్పులు చేయడం వలన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. కాగా, స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్‌లో ఏ మిస్టేక్స్ చేయకూడదో ఇప్పుడు చూద్దాం.పరీక్ష హాల్‌లోకి అడుగు పెట్టాక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్ హాల్‌కు వెళ్లాక, మీ స్నేహితులతో ఎక్కువగా మాట్లాడకూడదు. దీని వల్ల ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంది.
హాల్ టికెట్ మీద, ప్రశ్న పత్రం మీద ఏం రాయకూడదు.దీని వల్ల సమస్యల్లో పడే అవకాశం ఉంది. అలాగే పరీక్ష రాసే సమయంలో పక్క చూపులు చూడకండి. దీని వలన ఇన్విజిలేటర్ దృష్టిలో పడుతారు. దీంతో వారి ఫోకస్ మొత్తం మీ మీదనే ఉంటుంది. వారు పదే పదే మిమ్ముల్నే చూడటం వలన మీరు ఎగ్జామ్ సరిగా రాయలేరు. అలాగే స్క్వాడ్ వచ్చి మిమ్మల్ని తనిఖీ చేస్తే భయపడకండి. మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అయితే వారు వచ్చే ముందు మీరు ఇతరుల వైపు చూస్తే మీ మీద అనుమానం వస్తుంది. అందుకే మీ పరీక్షపై ఫోకస్ చేయండి. క్వశ్చన్ పేపర్‌లో మీకు ఏ ప్రశ్నలకు ఆన్సర్స్ వస్తాయో, వాటిని రాయాలి. అస్సలే ఇతరులతో మాట్లాడకూడదు, మాట్లాడాలని ప్రయత్నించకూడదు. దీని వల్ల బుక్ అయ్యే ఛాన్స్ ఉంది.