Telangana:విద్యార్థులకు బిగ్ అలర్ట్..రేపే లాస్ట్ డేట్..!
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించి టీజీ ఈఏపీసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ రేపటితో ముగియనుంది.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించి టీజీ ఈఏపీసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. EAPCET కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు జులై 13వ తేదీతో ముగియనుంది. ఆప్షన్ల నమోదుకు జూలై 15వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు 99,170 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినట్లు సమాచారం. 60 వేల మంది ఆప్షన్ల నమోదు చేసుకున్నారు. జులై 19 లోగా విద్యార్థులకు తొలి విడత సీట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత జులై 23లో లోగా విద్యార్థులు కాలేజీల్లో ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. గతేడాది వరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఒక వెబ్‌సైట్, ప్రవేశాల కౌన్సెలింగ్‌కు మరో వెబ్‌సైట్ ఉండేది. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యేవారు. ఈ సారి వెబ్‌సైట్ https://eapcet.tsche.ac.in/ లోకి వెళ్లి అక్కడ అడ్మిషన్‌పై క్లిక్ చేస్తే కౌన్సెలింగ్ వెబ్‌సైట్ http://tseapcet.nic.in/ లోకి వెళ్లొచ్చు.