ఇంటర్ BiPCతో బంగారు భవిష్యత్తు

ఇంటర్మీడియట్‌లో BiPC గ్రూపుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ గ్రూపు మెడికల్ స్ట్రీమ్‌కు ప్రసిద్ధి చెందింది. BiPCలో జీవశాస్త్రం, భౌతిక శాస్త్రంతో పాటు రసాయన శాస్త్రం సబ్జెక్టులు ఉంటాయి.

Update: 2023-04-12 12:14 GMT

ఇంటర్మీడియట్‌లో BiPC గ్రూపుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ గ్రూపు మెడికల్ స్ట్రీమ్‌కు ప్రసిద్ధి చెందింది. BiPCలో జీవశాస్త్రం, భౌతిక శాస్త్రంతో పాటు రసాయన శాస్త్రం సబ్జెక్టులు ఉంటాయి. MBBS, BDS వంటి సంప్రదాయ వైద్య కోర్సులతోపాటు మరికొన్ని ప్రత్యామ్నాయ కోర్సులు కూడా విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఈ స్ట్రీమ్ ఎంచుకుని ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బైపీసీ తర్వాత ఏయే కోర్సులుంటాయో తెలుసుకుందాం..

ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు తమ డాక్టర్ కల నెరవేర్చుకోవడానికి నీట్ ఎంట్రన్స్ పరీక్షలు రాసి ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నిస్తారు. అయితే కేవలం ఎంబీబీఎస్ కాకుండా బీడీఎస్‌తో పాటు అనేక కోర్సులు ఉన్నాయి. వైద్యరంగంలో స్థిరపడటానికి బైపీసీ గ్రూప్ ఒక మంచి ప్లాట్ ఫాంగా చెప్పవచ్చు. MBBS అనేది BiPC తర్వాత విద్యార్థులు కోరుకునే అత్యుత్తమమైన కోర్సు. అలాగే హోమియోపతి, ఆయుర్వేదం, నేచురోపతి, వెటర్నరీ సైన్స్, నర్సింగ్‌ వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

BiPC తర్వాత కోర్సులు ఇవే:

మెడికల్ కోర్సులు :

MBBS (మెడిసిన్ మరియు సర్జరీ),

BDS (డెంటల్ సైన్స్)

BDS నుండి MBBS బ్రిడ్జ్ కోర్సు

ఆయుష్ కోర్సులు:

BAMS (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదం, మెడిసిన్ మరియు సర్జరీ)

బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ (BNYS)

BHMS (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ)

వెటర్నరీ కోర్సులు : బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (BVSc)

అగ్రికల్చర్ కోర్సులు :

BSc అగ్రికల్చర్

BSc ఫారెస్ట్రీ

BSc బోటనీ

BSc బయాలజీ

నర్సింగ్ కోర్సులు: BSc నర్సింగ్

మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులు:

BTech బయోటెక్నాలజీ

BTech ఫుడ్ టెక్నాలజీ

BTech బయోమెడికల్ ఇంజనీరింగ్

ఫార్మసీ కోర్సులు:

D ఫార్మసీ

బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ

అలైడ్ హెల్త్ కోర్సులు :

BSc కార్డియాలజీ

BSc అనస్థీషియా

BSc రేడియాలజీ

BSc సైకాలజీ

BSc మైక్రోబయాలజీ

BSc ఆప్టోమెట్రీ

BSc రీనల్ డయాలసిస్ టెక్నాలజీ

BSc ఆడియాలజీ

BSc ఆక్యుపేషనల్ థెరపీ

BSc కోర్సులు :

BSc అనాటమీ

BSc ఫిజియాలజీ

ఫిజియోథెరపీ కోర్సులు:

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT)

ఆయుర్వేద కోర్సులు

హోమియోపతి కోర్సులు

నేచురోపతి కోర్సులు

Tags:    

Similar News