విపక్ష ప్రభుత్వాలపై ఇంత వివక్షా?
కేరళ పట్ల విపక్ష ప్రభుత్వాల పొడగిట్టని మోడీ ప్రభుత్వం కక్ష కట్టి వ్యవహరిస్తోంది. ప్రత్యేకించి కేరళలో విద్యారంగానికి న్యాయంగా అందవలసిన
కేరళ పట్ల విపక్ష ప్రభుత్వాల పొడగిట్టని మోడీ ప్రభుత్వం కక్ష కట్టి వ్యవహరిస్తోంది. ప్రత్యేకించి కేరళలో విద్యారంగానికి న్యాయంగా అందవలసిన నిధులను సకాలంలో ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వేధింపులకు గురిచేస్తోంది. కేరళ విషయంలో న్యాయస్థానాలు అనేక మొట్టికాయలు వేసినా.. గవర్నర్ చర్యలపై అధిక్షేపించినప్పటికీ కేంద్రం బుద్ధి మారలేదు. తాజాగా మరోసారి కేరళ విద్యారంగానికి కేటాయించిన నిధులను సకాలంలో ఇవ్వకుండా అనవసర జాప్యం చేస్తూ వేధిస్తుంది. గత రెండు దఫాలుగా అందవలసిన రూ.781 కోట్ల నిధులను ఇంతవరకు విడుదల చేయలేదు.
కొత్త పేచీలు పెడుతూ..
కేరళలోని పీఎం శ్రీ ప్రాజెక్టును పక్కకు పెట్టింది. ఈ విషయమై కేంద్రానికి అనేక విజ్ఞ ప్తులు చేసినా ప్రయోజనం లేదు. పైగా కేరళ విషయంలో పీఎం శ్రీ ప్రాజెక్టు నివేదికను ఎప్పుడు పంపారు? అంటూ పదేపదే ఎదురు ప్రశ్నలు వేస్తోంది. ఎప్పుడు ఉత్తరం రాసినా ఇదే పడికట్టు జవాబు చెబుతోంది. తన పాచి కలు పారని రాష్ట్రాలపై కేంద్రం కక్ష పూని ప్రవర్తిస్తోంది. కేరళ ప్రభుత్వం రాసిన ఉత్తరాల నఖలు బహిరంగంగా మీడియాకు, ప్రజలకు ప్రదర్శించినా బీజేపీ ప్రభుత్వం తన మొండి వాదన మానదు. దీనిపై కేరళలో ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆందోళన చేస్తు న్నాయి. సమయానికి నిధులను విడుదల చేయకపోవడం కారణంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా "విఝింజమ్" అంతర్జాతీయ పోర్టు నిర్మాణానికి సంబంధించిన వయబుల్ గ్యాప్ ఫండ్ (విజిఎఫ్) ను కూడా విడుదల చేయకుండా నిలిపివేశారు. ఈ నిధిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తనకు చెల్లించాలని కేంద్రం తన మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది. కొచ్చినగరంలో మెట్రో కోసం వీజీఎఫ్‌ను కేంద్ర మంజూరు చేసింది. అయితే మొదట తిరిగి చెల్లించాలన్న షరతులేమీ విధించలేదు. ఇప్పుడు కొత్తగా చెల్లించాలని పేచీ పెడుతుంది. ఇది పూర్తిగా వీజీఎఫ్ మార్గదర్శకాలకు వ్యతిరేకమైన మొండి వైఖరి.
కేరళకు సహాయ నిధి లేదు..
అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఆర్థిక కమిషన్ గ్రాంట్లకు కోత వేసింది. 14,15 ఆర్థిక కమిషన్ల కాలంలో భారీగా నిధులకు కోతపెట్టాయి. 14వ ఆర్థిక కమిషన్ 2.67 శాతం, 15వ ఆర్థిక కమిషన్ 2.68 శాతం కోత విధించాయి. అదే సమయంలో యూపీకి 16.5శాతం, మహారాష్ట్రకు 9.59 శాతం నిధులను స్థానిక సంస్థలకు పెంచింది. హర్యానా, గుజరాత్, బిహార్లకు కూడా గణనీయంగా స్థానిక సంస్థలకు గ్రాంట్లను పెంచింది. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న 21 రాష్ట్రాలకు విధ్వంస సహాయ నిధి నుంచి కేంద్రం 9,044కోట్లు విడుదల చేసింది. కానీ కేరళను మాత్రం వదిలివేసింది. ఇలా సమాఖ్య వ్యవస్థలో విపక్ష రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా వేధిస్తూ ఆ ప్రభుత్వాలను వేధించటం న్యాయమా? దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై అక్కసుతో, కక్షపూరితంగా అడ్డుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి భంగకరం, రాజ్యాంగ వ్యతిరేకం కూడా! కేరళ భారత భూభాగంలో అంతర్భాగం కాదా? కేంద్రానికి ఎందుకీ వివక్ష?
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,
98493 28496