స్థిత ప్రజ్ఞ దర్శకులు - రేలంగి నరసింహారావు

ఏడాదికి ఒక పది కామెడీ చిత్రాలు వచ్చాయనుకుంటే అందులో గుర్తు చేసుకుని నవ్వుకునే చిత్రాలు 5-6 ఉంటాయి.

Update: 2024-09-30 10:57 GMT

ఏడాదికి ఒక పది కామెడీ చిత్రాలు వచ్చాయనుకుంటే అందులో గుర్తు చేసుకుని నవ్వుకునే చిత్రాలు 5-6 ఉంటాయి. అవి ఖచ్చితంగా రేలంగి నరసింహారావు చిత్రాలే... సినిమాల్లోనైనా, నటుల్లోనైనా, దర్శకుల్లోనైనా ప్రేక్షకులకు జవాబుదారీగా ఉండాలంటారు. అప్పుడే దర్శక - నిర్మాతల ప్రయాణం సజావుగా సాగుతుందని నమ్మిన వారిలో రేలంగి నరసింహ రావు గారు ఒకరు. జీవితాన్ని దగ్గరనుంచి చూస్తే విషాదంగా, దూరం నుంచి చూస్తే కామెడీ గా ఉంటుందని చెప్పిన చార్లీ చాప్లిన్ మాటలకు అనుగుణంగా రేలంగి నరసింహారావు గారు సినిమాలు నిర్మించడం లో ముందుంటారు.

రేలంగి నరసింహ రావు గారు 30-09-1951 లో డా, రేలంగి రంగనాయకులు శివరావమ్మ దంపతులకు వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లు కళాశాలలో P.U.C (Pre university course) చదివారు. తండ్రి నరసింహారావు గారిని డాక్టర్ చదివిన్చాలనుకున్నారు. కానీ నరసింహారావు గారికి మెరిట్ మర్క్స్ రాలేనందు వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తండ్రి గారికి కళారంగం అంటే మక్కువ ఎక్కువ. చదువు ఆపేసిన కొడుకుని సినిమా ఫీల్డ్ కి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని మద్రాస్ కు తీసుకొచ్చారు. అప్పటికే పాలకొల్లు పట్టణం నుండి సినిమాల్లోకి ప్రవేశించిన అల్లు రామలింగయ్య ,చలం, నల్ల రామ్మూర్తి, కోళ్ళ సత్యం, పినిశెట్టి శ్రీరామ్మూర్తి గార్ల లాంటి వారు స్థిరపడ్డారు.

తండ్రితో వచ్చిన నరసింహారావు ని ముందుగా దాసరి నారాయణరావు గారుకి పరిచయం చేసారు. అప్పుడు పబ్లిసిటీ కేతాగారు, దాసరి నారాయణ రావు గారు రేలంగి రంగనాయకులు మీద ఉన్న గౌరవంతో 'మొహమద్ బీన్ తుగ్లక్ అనే సినిమాకి రేలంగి నరసింహారావు గారిని శ్రీ బి.వి. ప్రసాద్ గారి దగ్గర అప్రెంటీస్ గా దర్శకత్వ విభాగం లో పెట్టించారు. అదే సినిమా కి దాసరి గారు సంబాషణల రచయితగా పని చేస్తున్నారు.

ఆ విధంగా నరసింహారావు గారు 1971 లో చిత్ర సీమలోకి అడుగు పెట్టారు. తదుపరి కాలంలో KSR దాస్ 1972 లో చేస్తున్న "ఊరికి ఉపకారి" సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. దాసరి నారాయణ్ రావు గారు 1973 లో నిర్మిస్తున్న "సంసారం-సాగరం" సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. ఆ రోజు మొదలుకుని మడం వెనక్కి తిప్పకుండా 1980 వరకు దాసరి గారి సహచర్యం లో సహాయ దర్శకుడిగా మెలుకువలు నేర్చుకున్నారు.

గురువు గారు (దాసరి గారు) ప్రోత్సాహం లో స్వీయ దర్సకత్వం లో 1980 లో "చందమామ " సినిమా తీసారు. కారణాంతరాల వాళ్ళ ఆ సినిమా 1982 లో రిలీజ్ అయ్యింది. ముందుగా "నేను -మా ఆవిడ", ఏవండోయ్ శ్రీమతి గారు, ఇల్లంతా సందడి, అనే 3 చిత్రాల ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. వీరి చరిత్రలో విజయవంతంగా పూర్తిచేసి ప్రజాదరణ పొందిన చిత్రాలు 67 కాగా, కన్నడం లో 7, తమిళంలో 1, మొత్తం (75) చిత్రాలకు దర్సకత్వ బాధ్యత వహించి ప్రతిభ చాటుకున్నారు.

అగ్రశ్రేణి నటులైన అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణం రాజు గారు, శోభన్ బాబు,చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, నరేష్ గారు, సుమన్ గారు లాంటి వాళ్ళతో సినిమాలు నిర్మించి చిత్రసీమలోని దర్శకుల్లో సుస్థిర స్థానాన్ని కల్పించుకున్నారు.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నుండి "సుందరి సుబ్బారావు" చిత్రానికి 1984 లో "నంది అవార్డ్" అందుకున్నారు. చిన్ని చిత్రాల నిర్మాత గా డిల్లీలోని "తెలుగు అకాడమి" వాళ్ళు ఉత్తమ దర్శకుడిగా గుర్తించి గౌరవించారు. ఆయన అందుకున్న చిన్న పెద్ద పురస్కారలన్నిటినీ ఎంతో సహృదయంతో వినయంగా చిరునవ్వుతో అందుకుని తిరిగి చిత్రసీమ పురోగాతికే అంకితమిచ్చిన సౌమ్యమూర్తి "రేలంగి నరసింహారావు గారు".shooting స్పాట్ లో నటీనటులతో ఎంతో వినయంగా ఆప్యాయంగా మాట్లాడుతూ తనకు కావాల్సిన సన్నివేశాన్ని రాబట్టుకుని చిత్రించేవారు. వారి చిత్రాల్లో రాజేంద్రప్రసాద్ తో తీసిన అనేక చిత్రాల్లో మధ్యతరగతి మనుషుల బ్రతుకు భారాన్ని హాస్యంగా చిత్రించి ప్రేక్షకులు నవ్వుకునేలా చేసేవారు.

రేలంగి నరసింహారావు స్థితా ప్రజ్ఞ దర్శకుడిగా ఒక తరం దర్శకుల్లో గుర్తింపు పొందారు.ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న "రేలంగి నరసింహారావు" గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకుంటూ ఉండాలని కోరుకుంటున్నారు. మంచి హస్యభరిత చిత్రాలను చేయాలని రేలంగి నర్సింహారావ్‌ను అభిమానించి, ఆరాదించే ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉంటారు.

(నేడు రేలంగి నరసింహారావు జన్మదినం సందర్భంగా)

-రావుల పుల్లాచారి (విశ్రాంత పర్యవేక్షకుడు)

హుజూరాబాద్,

సెల్: 9949208476


Similar News