డీలిమిటేషన్‌ను ఆపాలంటే.. జేఏసీ తప్పనిసరి!

సంఖ్యాబలంతో లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లు-2025ను ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదింపజేసుకున్నది.

Update: 2025-04-08 01:00 GMT

సంఖ్యాబలంతో లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లు-2025ను ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదింపజేసుకున్నది. జేడీయూ, తెలుగుదేశం పార్టీ వంటి మిత్రపక్షాల సహకారంతో బీజేపీ రెండు సభల్లోనూ బిల్ పాస్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. అయితే వక్ఫ్ బిల్లు విషయంలో దూకుడుగా వెళ్లిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. డీలిమిటేషన్ విషయంలోనూ అలాగే వ్యవహరించే అవకాశముంది. 

దక్షిణాది రాజకీయ పార్టీలు.. జాతీయ స్థాయిలో ఏ కూటమిలో ఉన్నా.. వీరు కలిసికట్టుగా పోరాడకపోతే... ఇక్కడి ప్రజలకు తీరని నష్టం జరిగే ప్రమాదముంది. వాస్తావానికి 2011 లో జరగాల్సిన జనాభా లెక్కలు 2025లో చేపడు తారని భావిస్తున్నారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే ఎంపీ స్థానాల సంఖ్య 800 నుంచి 1000 వరకు పెర గొచ్చు. అయితే ఈ ప్రక్రియలో ఉత్తరాది రాష్ట్రా లు ఎంతో లాభపడుతుండగా, దక్షిణాది రాష్ట్రాల ప్రాతిని ధ్యం తగ్గే ప్రమాదమున్నది. దీంతో భవిష్యత్తులో దక్షిణాది గళానికి విలువలేకుండాపోతుంది.

సీట్ల సంఖ్య ఇలా..

1951–52లో దేశ జనాభా 36 కోట్లు. అప్పుడు లోక్‌సభ సీట్లు 489. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన 1971లో దేశ జనాభా 54 కోట్లు. అప్పుడు సీట్ల సంఖ్యను 545కు పెంచారు. ఇక 1976లో ఎమర్జెన్సీ సమ యంలో లోక్‌ సభ సీట్ల సంఖ్యను మరో 25 ఏళ్ల పాటు 1971 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలని 42వ రాజ్యాంగ సవరణ చేశారు. 2001లో నియోజకవర్గాల పునర్విభజన జరగా ల్సి ఉన్నా.. అప్పట్లో ప్రధానిగా ఉన్నా వాజ్ పేయి 84వ రాజ్యాంగ సవరణ చేసి లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచకుండా పునర్ వ్యవస్థీకరణ చేశారు. కొన్ని జనరల్‌ స్థానాలను ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించి.. వారి ప్రాతినిధ్యం పెంచా రు. లోక్‌సభ సీట్ల సంఖ్య పెంపు అంశాన్ని 2026కి వాయిదా వేశారు. అయితే మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 2026లో ఎలాగైనా నియోజకవర్గాలను పునర్విభజించాలని భావిస్తున్నది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కలే అందుబాటులో ఉన్నా యి. కరోనా కారణంగా 2021 జనగణనను వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వం 2025లో జనగణన చేస్తుందనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు కేంద్రం జనగణనను పూర్తి చేసి నియోజకవర్గాలను పునర్విభజిస్తుందా? లేదా 2011 డేటాను పరిగణనలోకి తీసుకొని పునర్విభజన చేస్తుందా? అనేది వేచిచూడాలి.

ఉత్తరాది రాష్ట్రాలు లాభపడేది ఇలా..

ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం సీట్ల సంఖ్య 80. పునర్విభజనతో ఆ రాష్ట్రంలో సీట్ల సంఖ్య 160కి పైగా పెరిగే అవకాశముంది. అంటే సీట్ల సంఖ్య దాదాపు రెట్టింపు అవుతుంది. ఆ రాష్ట్ర ప్రాతి నిధ్యం 14.7% నుంచి 16 శాతానికి పెరుగుతుంది. రాజస్థాన్‌లో ప్రస్తుతం 25 ఎంపీ సీట్లు ఉండగా, అవి కూడా 52‌కి పెరుగుతాయని అంచనా. ఇక్కడ కూడా సీట్లు రెట్టింపు అవుతున్నాయి. అలాగే బిహార్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు కూడా గణనీయ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి.

దక్షిణాది నష్టపోయేది ఇలా..

1952లో పార్లమెంట్‌ స్థానాల సంఖ్య 489 కాగా, ఇందులో దక్షిణాది వాటా 25.35 శాతం. 1967లో సీట్ల సంఖ్య 522 కాగా, దక్షిణాది వాటా 24.13 శాతానికి పడిపోయింది. 1977 లో సీట్ల సంఖ్య 545 కు చేరగా, దక్షిణాది సీట్ల వాటా 23.85 శాతానికి పడిపోయింది. అయితే ప్రస్తుతం డీలిమిటేషన్‌తో తెలంగాణ లోక్‌సభ సీట్ల సంఖ్య 17 నుంచి 39కి పెరిగే అవకాశముంది. అంటే పెరుగుదల 48 శాతం మాత్రమే. దీని ద్వారా పార్లమెంట్ లో తెలంగాణ ప్రాతి నిధ్యం 3.1 శాతం నుంచి 3.3 శాతానికి చేరుకుంటుంది. అదే ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే సీట్ల సంఖ్య 25 నుంచి 52కు పెరుగుతుండగా, ఏపీ వాటా మాత్రం 4.6 శాతం నుంచి 4.3 శాతానికి పడిపోతుంది. తమిళనాడులో 28 శాతం సీట్లు పెరుగనుండగా.. కేరళలో కేవలం ఒక్క శాతం మాత్రమే సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇలా అయితే పార్లమెంటులో తమిళనాడు ప్రాతినిధ్యం 7.2 శాతం నుంచి 6.4 శాతానికి, కేరళ ప్రాతినిధ్యం 3.7 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోతుంది.

పోరాడితేనే..

ప్రస్తుత జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాదిలోని నాలుగైదు రాష్ట్రాల్లో సత్తా చాటగలిగిన పార్టీలు దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. దీంతో దక్షిణాది రాష్ట్రాలు తమ హక్కులు కోల్పోయే ప్రమాదముంది. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గితే కేంద్రం నుంచి న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువ. అందుకే డీలిమిటేషన్‌తో జరిగే నష్టంపై ఆందోళనలతో దక్షిణాదికి చెందిన మెజార్టీ పార్టీలు ఏకమై జేఏసీగా ఏర్పడి పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే తమిళనాడులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. రెండోది తెలంగాణలో నిర్వహించబోతున్నారు. అయితే పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపిన తెలుగుదేశం, జనసేన, ఎటు ఓటేశారో తెలియని వైసీపీ సైతం తమిళనాడులో ఏర్పరచిన జేఏసీ లో పాల్గొనలేదు. ఆ రాష్ట్ర రాజకీయ పార్టీల నాయకులు.. సీట్ల వాటాలో దక్షిణాదికి నష్టం జరిగితే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుందని గుర్తించాలి. లేకపోతే ఆయా పార్టీల అధి నేతలు ప్రజల ముందు ముద్దాయిగా నిలబడాల్సి ఉంటుంది.

-ఫిరోజ్ ఖాన్,

సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,

96404 66464

Tags:    

Similar News