కోనోకార్పస్ చెట్లు. మంచివే!

తెలుగు రాష్ట్రాల్లో కోనో కార్పస్ (దుబాయ్) మొక్కలపై గత 4 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తూ

Update: 2025-04-12 00:30 GMT
కోనోకార్పస్ చెట్లు. మంచివే!
  • whatsapp icon

తెలుగు రాష్ట్రాల్లో కోనో కార్పస్ (దుబాయ్) మొక్కలపై గత 4 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తూ కోనో కార్పస్ మొక్కలను నరికి వేస్తున్నారు. ఈ మొక్కలు తెలుగు రాష్ట్రాల్లో రహదారుల పక్కన డివైడర్లపై, పరిశ్రామిక ప్రాంతాల్లో లక్షలాది మొక్కలు పెద్దవై వాయు కాలుష్యాన్ని, ధ్వని కాలుష్యాన్ని నివారిస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్ అత్తిపల్లి రామచంద్రారెడ్డి కోనో కార్పస్ మొక్కలపై పరిశోధనలు చేసి ఈ మొక్కలు అత్యధిక కార్బన్ డై యాక్సైడ్‌ను తీసుకుని అత్యధికంగా ఆక్సిజన్ ను అందించే మొక్కని ఋజువు చేశారు. మొక్కల మాఫియా నర్సరీలు ఈ మొక్కలపై విష ప్రచారం చేస్తున్నారు. గత 75 సంవత్సరాలుగా వన మహోత్సవాల పేరుతో కోట్లాది మొక్కలను నాటినట్లు ప్రకటిస్తూ వేలాది మొక్కలను కూడా బ్రతికించడం లేదు.

కోనో కార్పస్ మొక్క ఎలాంటి నిర్వహణ వ్యయం లేకుండా దాదాపు నాటిన ప్రతి మొక్క బతుకుతూ సుందరంగా ఉంటూ పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. కోనో కార్పస్ మొక్కలపై శాస్త్రీయ అవగాహన కల్పించడానికి, దురభిప్రాయాలను తొలగించడానికి ఈనెల 15వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశాన్ని జనచైతన్య వేదిక ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రముఖ శాస్త్రవేత్త సెంటర్ ఫర్ సేల్యులర్ మాలిక్యులర్ బయాలజీ పూర్వ డైరెక్టర్, తెలంగాణ సైన్స్ అకాడమీ చైర్మన్ డా. సి.హెచ్. మోహన్ రావు, పూర్వ వైస్ ఛాన్స్‌లర్ యోగి వేమన యూనివర్సిటీ ఎమిరిటస్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ ఎ.ఆర్. రెడ్డి, ప్రముఖ పర్యావరణ వేత్త ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర పూర్వ ఆచార్యులు ప్రొఫెసర్ కె. బయ్యపు రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ వృక్షశాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ బి.ఎన్.రెడ్డి, జీవ శాస్త్ర నిపుణులు జి.గోపాలకృష్ణ ప్రసంగిస్తారు.

- వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

99499 30670

Tags:    

Similar News