స్వేచ్చా ఫలాలు

Poem on Independence day

Update: 2023-08-14 22:45 GMT

నెత్తురోడి, గావుకేకలు పెట్టి

చెరసాల సంకెళ్ళతో పోరాడి ఓడి

ప్రాణాలర్పించి గెలిచిన

స్వేచ్చా ఫలాలేవి?

గాంధీ కలలు కన్న

స్వరాజ్యం విదేశీ వీధుల్లో

బందీగా నిలిచేనా?

చాచాజి శాంతి పావురం

అశాంతిగా అవతారమెత్తేనా?

నింగినున్న చంద్రన్నకై నిచ్చెనలు

నేలపై నలిగిపోతూ కామాంధులకు

బలైపోతున్న చందమామలను

కల్లుండి చూడలేని ధృతరాష్ట్రులా?

పిలిచినా పలకని న్యాయదేవత మనది

కులపిచ్చికి పేరెన్నికైన దేశం మనది

సాంకేతికమే సర్వాభివృద్దని

నిరుద్యోగమే సాధించిన ప్రగతి మనది

నామమాత్రపు హక్కులే పౌరహక్కులనే

భ్రమలో బ్రతుకుతున్న బలహీనులం

అర్థరాత్రి కాదు పట్టపగలు

ఏ వేధింపులకు లోను కానీ

స్వేచ్ఛా విహంగమై గమ్యానికి

చేరువైనప్పుడే నిజమైన స్వాతంత్ర్యం

ఎం. లక్ష్మి

Tags:    

Similar News