గొప్పవారి గాథలు చదువుదాం..!

నేటి యువతరం ఆత్మవిశ్వాసంతో అనం త విశ్వమే హద్దుగా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆత్మన్యూనతాభావంతో

Update: 2024-12-04 00:45 GMT

నేటి యువతరం ఆత్మవిశ్వాసంతో అనం త విశ్వమే హద్దుగా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆత్మన్యూనతాభావంతో ఆత్మహత్యలు, హత్యల తో తమ జీవితాలను అశాంతిమయం చేసుకుంటుంది. ఉన్నత విద్యనభ్యసించిన వ్యక్తులు, ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం జీవితంలో ఎదురయ్యే వివిధ రకా ల, రంగాలలో శారీరక మానసిక ఓటమిలను, సమస్యలను తట్టుకోలేక డిప్రెషన్‌కులోనై నిరాశావాదంలో బతుకుతున్నారు.

మార్కుల, గ్రేడ్‌ల చాటున..

ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహానుభావుల జీవిత చరిత్రలు నవతరం చదవ డం లేదు. తెలుసుకోవడం లేదు. విద్యాసంస్థల్లో కూడా మార్కులు, గ్రేడ్‌ల చాటున వ్యక్తిత్వపు పాఠాలకు సమయం లేదు. చరితను ప్రభావితం చేసిన అసాధారణ వ్యక్తులు కూడా మన లాంటి సాధారణ వ్యక్తులని, ఎన్నో పెద్ద పెద్ద సమస్యల అవరోధాల్ని అధిగమించారని, వైఫల్యాల నిశ్శబ్దం చాటున గెలుపు శబ్ద మై మిగిలారని తెలుసుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా తన జీవితం వీల్ చైర్‌కే పరిమితమైనప్పటికీ ఆధునిక ఐన్‌స్టీన్‌గా ఎదిగిన స్టీఫెన్ హాకింగ్ జీవన ప్రస్థానం ఎంత స్ఫూర్తిదాయకం. ఈ విశ్వం ఎంత పెద్దదైనా కావచ్చు. కానీ మన ప్రయ త్నాల ముందు చాలా చిన్నది అంటూ బ్లాక్ హోల్స్‌పై ఆయన పరిశోధనలు నేటి సైన్సుకు సవాళ్లుగా మారాయి. అహింస, సత్యాగ్రహాలతో అసమానతలు, వివక్షపై ఆయన చేసిన మానవతపు నైతిక పోరా టం విశ్వ విఖ్యాత మేధావులనే కదిలించింది. ఆల్బర్ట్ ఐన్ స్టీన్, బరాక్ ఒబామా, మార్టిన్ లూథర్ కింగ్, బెర్నార్డ్ షా, ఆంగ్ సాన్ సూకీ వంటి ఎంతో మంది నోబెల్ విజేతలకే స్ఫూర్తి ప్రదాతగా నిలిపింది.

నెలకు ఇద్దరి జీవితాలను చదువుదాం!

మహిళవు కాబట్టి ఉన్నత విద్యకు అర్హురాలివి కావంటూ పరిశోధనలకు అవకాశం ఇవ్వలేమంటూ చేసిన అపహేళనలను భరించిన మేడం క్యూరీ తన అసాధారణ ప్రయత్నాల పట్టుదల పరంపరలో భౌతిక, రసాయన శాస్త్రాలు రెండింటిలో పరిశోధనకై నోబెల్ గెలిచిన ఏకైక వ్యక్తిగా నిలి చింది నేటికి. దాదాపు 27 సంవత్సరాల జైలు జీవితం అనుభవించి 'ఎ లాంగ్ వాక్ టూ ఫ్రీడం' అంటూ తన జీవిత చరిత్రను వివరించిన నెల్సన్ మండేలా, బల్బును కనుగొనే ప్రయత్నంలో అపజయాల కెరటాలకు తలొంచని ఎడిసన్, అంబేద్కర్, అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్, కల్ప నా చావ్లా, మదర్ థెరిస్సా వంటి వివిధ రంగాల ప్రముఖుల జీవిత చరిత్రలు మన జీవితాలకు వెలుగు దివ్వెలై మన జీవితాలకు మార్గదర్శనం చేస్తూనే వుంటాయి.. గురుత్వాకర్షణ ప్రభావాన్ని అధిగమిస్తూ తన రెక్కల సాయంతో స్వేచ్ఛగా ఆకాశం లో ఎగిరే పక్షిలోని ఆశావాదం మనకు ఆంజనేయస్వామి దండకం కావాలి. అందుకే కనీసం నెలకు ఓ ఇద్దరి ప్రఖ్యాత వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేద్దాం. వెలుతురు, చీకటి ప్రకృతి సహజమని గుర్తిద్దాం. నేను ఆరంభించాను ఈ రోజు నుంచే.. మరి మీరు..!!

ఫిజిక్స్ అరుణ్ కుమార్

ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ,

93947 49536

Tags:    

Similar News