ఇజ్రాయిల్ - హిజ్బుల్లా కాల్పుల విరమణ సాధ్యమా!

ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిజ్బుల్లా‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ సంవ త్సరం చివరి రోజుల్లో అంగీకరిం చడం ప్రపంచ శాంతికాముకులు

Update: 2024-12-04 00:45 GMT

ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిజ్బుల్లా‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ సంవ త్సరం చివరి రోజుల్లో అంగీకరిం చడం ప్రపంచ శాంతికాముకులు సంతోషపడే సమయం. నిజానికి అయన లక్ష్యాలు, ఊహలు వేరుగా ఉన్నాయి. ఇందులో హిజ్బుల్లా సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేయడం, ఉత్తర సరిహద్దులను భద్రపరచడం ముఖ్యమైనవి. అయితే మారిన పరిస్థితుల్లో ఆయన వాటిని పక్కన పెట్టినట్లు కనిపించినా, ఇది సైనిక, రాజకీయ, అంతర్జాతీయ ఒత్తిళ్ల సంక్లిష్టత వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తుంది. ఈ ఒప్పందం రెండు పక్షాలకు పునరుద్ధరణకు అవకాశాన్ని ఇస్తుంది.  

ఈ కాల్పుల విరమణకు పలు కారణాలను కనపడుతున్నాయి. లెబనాన్‌లో హిజ్బుల్లాతో యుద్ధం చేయడం, గాజాలో హమాస్‌తో పాటు వెస్ట్ బ్యాంక్‌లోని అశాంతిని ఎదుర్కోవడం, ఇజ్రాయిల్ రక్షణ దళాలను (ఐడీఎఫ్) ఎక్కువగా ఒత్తిడి చేసాయి. రెండు పక్కలా ఒకేసారి యుద్ధం చేయటంలో ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి మానవ వనరులు (సైనిక శక్తిని) సమకూర్చుకోవటం. దానితో పాటు ఆయుధాలు కూడా చాలావరకు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు వాటిని సమకూర్చుకొనేంత సమయం కావాలి. ఆర్థిక వనరులూ కావాలి. ఒకేసారి లెబనాన్, ఇరాన్, గాజా ప్రాంతాలతో యుద్ధాలు చేయడం వ్యూహాత్మకంగా క్షేత్రస్థాయిలో లోపాలు ఏర్పడేలా చేసింది. భారీగా ఆయుధ నిల్వలు ఖర్చ య్యాయి. భారీగా నిధులు అవసరం కావడంతో ఇజ్రాయిల్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పుల భారంతో అమెరికా కోశాగారం ఖాళీ కావటంతో ఇజ్రాయిల్‌కు ఆర్ధికంగా సహకరించే పరిస్థితిలో లేదు. దానితో ఏదో విధంగా యుద్ధ విరమణ చేసుకోవడం నెతన్యాహుకు తప్పనిసరి.

అలసిన సైన్యం.. ఆర్థిక కుంగుబాటు

ఉత్తర ఇజ్రాయిల్ నుండి బాగా దెబ్బతిన్న సైనికులు, పౌరులపై యుద్ధం తీసుకొచ్చిన ఆర్థిక కుంగుబాటు ప్రభావం కాల్పుల విరమణ కోసం నెతన్యాహుపై ప్రత్యామ్నాయాలను అన్వేషించమని ఒత్తిడి తెచ్చింది. హిజ్బుల్లాపై పోరులో పరిమిత విజయాలు మాత్రమే దక్కాయి. వాటిలో కొన్ని కీలక విజయాలు కూడా ఉన్నాయి. భారీ బాంబుదాడులతో లక్ష్యమైన హత్యలు (హసన్ నస్రల్లా, హషెమ్ సఫీదిన్ వంటి కీలక నాయకులను చంపడం) గొప్ప ఘన విజయమే. అయితే హిజ్బుల్లా రాకెట్ సామర్థ్యాలను గణనీయంగా నిర్వీర్యం చేయడంలో ఇజ్రాయిల్ ఘోరంగా విఫలమైంది. కాల్పుల విరమణకు కొద్ది రోజుల ముందు కూడా హిజ్బుల్లా పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగించింది. అంతర్జాతీయ ఒత్తిడి కూడా కలిపి కాల్పుల విరమణకు దారితీసింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ విషయంలో కీలకపాత్ర పోషించారు. లెబనా న్‌ను మరింత స్థిరం చేయడానికి ప్రతిపాదన చేశారు. ఫ్రాన్స్ కూడా ఈ ఒప్పందానికి మద్దతు తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో లెబనాన్‌లో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఈ నిర్ణ యంపై ఒత్తిడి పెరిగింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం యూఎన్ఎస్‌సీ తీర్మానం 1701లో నిక్షిప్తమైనది. దానికి అనుగుణంగానే హిజ్బుల్లా, లిటానీ నదికి ఉత్తరం ప్రాంతం ఖాళీ చేయాలి. లెబనాన్ ఆర్మీ, దక్షిణ లెబనాన్‌లో తన కార్యకలాపాలను యధావిధిగా అమలు చేయబడు తుంది. హిజ్బుల్లా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పక్షంలో, ఇజ్రాయిల్ తిరిగి యుద్ధ చర్యలు ప్రారంభించే హక్కును కలిగి ఉంది.

సవాళ్లు, ప్రభావాలు..

హిజ్బుల్లా ‌పై దాడులు జరిగినా దాని స్థైర్యం కొంతమేరకు బలహీనపడినా, అది ప్రబల శక్తిగానే మిగిలింది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే, లెబనాన్ ఆర్మీ తగిన చర్యలు తీసుకోవడం కష్టతరం కావచ్చు. అలాగే నెతన్యాహు ఈ కాల్పుల విరమణను వ్యూహాత్మక విరామంగా భావించాలి. విమర్శకుల అభిప్రాయం ప్రకారం, హిజ్బుల్లా పునరుద్ధరణకు అవకాశం కల్పించడం, యుద్ధ లక్ష్యాలలో ప్రధానమైనది. అయినా దాని విషయంలో తగినంత కృషి చేయకపోవటం ఒప్పందం విఫలత్వాన్నే సూచిస్తుంది. చివరగా ప్రాంతీయ గణాంకాలు అనుసరించి చూస్తే ఇరాన్ భద్రతకు, గాజా, లెబనాన్ పునర్నిర్మాణానికి ఈ యుద్ధ విరామం అవసరం కూడా. ఇజ్రాయిల్‌లో స్వదేశీ పౌరుల ఒత్తిడి వల్ల ఈ ఒప్పందం ప్రాముఖ్యత సంతరించుకుంది. భవిష్యత్తు క్రమంలో, ఇది ప్రాంతీయ క్షేత్రంలో ప్రభావం చూపనుంది.

ఈ విరామంలో..

నెతన్యాహు హిజ్బుల్లాతో కాల్పుల విరమణను అంగీకరించడం, ఆధునిక యుద్ధ వ్యూహాల పరిమితులను, అంతర్జాతీయ ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. ఇది తాత్కాలికంగా ఉత్తర సరిహద్దులను స్థిరపరచవచ్చు, కానీ దీర్ఘకాలిక ప్రభావాల గురించి అనుమానం కలుగుతుంది. ఈ విరామం ద్వారా, భవిష్యత్తులో మరిన్ని వ్యూహ త్మక ఎత్తుగడలు అవసరం కావచ్చు. ట్రంప్ అమెరికా తరపున ఏలాంటి నిర్ణయాలు తీసుకొంటాడో తెలియని పరిస్థితి. ఇరాన్‌పై దాడులు కొనసాగితే మాత్రం ప్రపంచం ఆయిల్ సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే అగ్రదేశాలతో సహా అన్ని దేశాలు ఆర్ధికంగా చితికిపోయి వ్యవస్థలు అన్నీ ద్రవ్యో ల్భణం అంచున ఉన్నాయి. ఇంకా యుద్ధాలు మరికొంత కాలం కొనసాగితే ఆర్థిక, సామాజిక అభివృద్ధి పథకాలు పరిష్కారం లేని గందరగోళాలకు కారణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- డా. కిషోర్ ప్రసాద్

98493 28496

Tags:    

Similar News