మానవీయ కోణం చూపించాలి!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే వరదలతో ఆయా నగరాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇటువంటి అనేకమైన వరదలు గతంలో

Update: 2024-09-06 00:45 GMT

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే వరదలతో ఆయా నగరాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇటువంటి అనేకమైన వరదలు గతంలో సంభవించిన పరిస్థితులు ఉన్నా.. ఈ వరదలకు ప్రత్యామ్నాయం మాత్రం కనిపించడం లేదు. 

రెండు, మూడేళ్లకోసారైనా ప్రకృతి ప్రకోపానికి ఏదో చోట వరదలు పొంగి ప్రాణ, ధన నష్టం జరుగుతుంది. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఇటు వంటి ప్రకృతి ప్రళయాలు, విపత్తులను ఎదుర్కోవడానికి సామాజిక బాధ్యతగా నిలవాలి. ఏ రకమైన అవకాశం ఉంటే ఆ రకంగా సమాజ శ్రేయస్సు కోసం అండగా నిలబడాలి.

సమిష్టి సహాయం అత్యవసరం!

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కుండపోత వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకొని సినీ హీరోలు, దర్శకులు, నిర్మా తలు తదితర నటీనటులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు అందజేశారు. అలాగే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సైతం సుమారు వంద కోట్ల వరకు సీఎం సహాయనిధికి తమ వేతనాల నుంచి అందించడానికి ముందుకు వచ్చినట్లు ప్రకటించారు. ఇటువంటి మానవీయ కోణం ఇటువంటి సమయంలో చాలా అవసరం. వివిధ విభాగాలతో పాటు.. పౌర సమాజం ఇటువంటి ప్రళయాలను విపత్తులను ఎదుర్కోవడానికి సామాజిక బాధ్యత వహిం చాలి. విపత్తులు మానవ ఉనికిని ప్రశ్నార్థకంలోకి ముంచేసేవి అటువంటి విపత్తులను, ప్రళయాల సమ యంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కదలాలి. ఇది ఏ రాజకీయ పార్టీనో, ప్రభుత్వాలు మాత్రమే చేసే బాధ్యత అనే భావనలో నుంచి మనం బయటకు రావాలి. రేపటి మానవ సమాజం కోసం ఎక్కడికక్కడ శక్తిని ప్రదర్శించాలి. కార్పొరేట్ సంస్థలు. అండగా నిలవాలి. ప్రభుత్వాల చేత లబ్ది పొందిన సంపన్నులు సాయంగా ఉండాలి. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ కనీసం మూడు నెలల వేతనాలను ఈ ప్రకృతి ప్రళయానికి నష్టపోయిన వారి కోసం అందించాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన కుటుంబాలను, ప్రజలను గుర్తించి వారికి కావాల్సిన అండదండలు అందించాలి.

- సంపత్ గడ్డం

78933 03516

Tags:    

Similar News