16 సంవత్సరాలైనా.. విద్యా వ్యవస్థలో మార్పులేదు!
6 నుండి 14 సంవత్సరాలు గల పిల్లలకు ఉచిత నిర్భంద విద్యను అందించడం కోసం భారత పార్లమెంటులో

6 నుండి 14 సంవత్సరాలు గల పిల్లలకు ఉచిత నిర్భంద విద్యను అందించడం కోసం భారత పార్లమెంటులో 2009 ఆగస్ట్ 4న ఆమోదం పొంది ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమో దం పొందింది. 2010 ఏప్రిల్ 1 నుండి దేశంలో విద్య హక్కు చట్టం అమలులోకి వచ్చింది. దీంతో విద్యను ప్రాథమిక హక్కుగా అందించే 135 దేశాల సరసన మనదేశం చేరింది. బడుల మంజూరు, విద్య పని దినాలు, ఉపాద్యాయ విధులు, ప్రైవేట్ పాఠాశాలల్లో పేద విద్యార్థులకి సీట్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. చట్టం అమలులోకి వచ్చి 16 సంవత్సరాలు అవుతున్న నేటికి పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. బడుల మంజూరు చేయాలని చట్టంలో ఉంటే.. హేతుబద్ధీకరణ పేరుతో బడు లు మూసివేయడం చెస్తున్నారు.. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా టెట్ పరీక్ష నిర్వహించాలని చట్టంలో ఉంటే.. సంవత్సరాలు గడిచాక టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఉపాధ్యా య ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని చట్టంలో ఉంటే 10 సంవత్సరాలకు ఒకటి రెండు సార్లు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైన విద్యాహక్కు చట్టం సక్ర మంగా అమలు చేయాలి. టీచర్లను బడుల్లో బోధనకు మాత్రమే వినియోగించుకోవాలి..ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా అందరూ కలిసి కృషి చేయాలి.
-రావుల రామ్మోహన్ రెడ్డి
93930 59998