100 ఏళ్ల గ్రంథాలయం!
లూసియో టాన్ చెప్పినట్లు నాణ్యమైన విద్య లేకుండా మనం ఒక దేశంలో ఆర్థికంగా, సామాజికంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందలేము. దానికి అనుగుణంగా
లూసియో టాన్ చెప్పినట్లు నాణ్యమైన విద్య లేకుండా మనం ఒక దేశంలో ఆర్థికంగా, సామాజికంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందలేము. దానికి అనుగుణంగా 1919లో సాడ్లర్ కమిషన్ సూచనలకు మేరకు సరిగ్గా నూరు వసంతాల కింద బాంబే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ల సమావేశంలో 1925 మార్చి 23న ఇంటర్-యూనివర్సిటీ బోర్డు (IUB) ఏర్పడి అన్ని విశ్వవిద్యాలయాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు, విద్యార్థులతో ప్రయోజనాలను కాపాడేందుకు, సమన్వయంగా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థకు తొలి అధ్యక్షులుగా డాక్టర్ అక్బర్ హైదర్ నవాబ్ (హైదర్ నవాజ్ జంగ్ బహదూర్) గణనీయమైన సేవలు అందించి సంస్థ ఆవిర్భావానికి నూతన జవసత్వాలు అందించడానికి విశ్వప్రయత్నం చేశారు. ప్రస్తుతం 103వ అధ్యక్షులుగా ఆచార్య వినయ్ కుమార్ పాతక్ సేవలందిస్తున్నారు.
25,000 కంటే ఎక్కువ పుస్తకాలు..
ఈ సంఘాన్ని 1973లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU)గా పేరు మార్చబడింది. ఉన్నత విద్యాభివృద్ధి, నాణ్యమైన విద్య, పరిశోధన, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఈ సంస్థ చురుకుగా సేవలందిస్తున్నది. సంఘంలో అన్ని రకాల విశ్వవిద్యాలయాలు (సంప్రదాయ విశ్వవిద్యాలయా లు, ఓపెన్ యూనివర్శిటీలు, రాష్ట్ర, కేంద్రీ య, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, జాతీ య ప్రాముఖ్యత కలిగిన సంస్థలు) సభ్యు లుగా కలిగి ఉన్నారు. వీటితో పాటు బంగ్లాదేశ్, భూటాన్, రిపబ్లిక్ ఆఫ్ ఖజకిస్తాన్, మలేషియా, మారిషస్, నేపాల్, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరే ట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ నుండి 13 విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్ దాని అసోసియేట్ సభ్యులు ఈ సంఘంలో సభ్యులుగా ఉంటారు. దేశంలో నాణ్య మైన ఉన్నత విద్యను ఉత్పత్తి చేయడంలో, ఉన్నత స్థాయి పరిశోధనలు చేయడంలో వాటికి కావలసిన కార్యకలాపాలు రూపొందించడానికి, 1975లో భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో పరిశోధన విభాగం స్థాపించబడింది. 1964లో లైబ్రరీ డాక్యుమెంటేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది 2019 నాటికి ఉన్నత విద్యలో అద్భుతమైన సమాచార వనరుల కేంద్రంగా ఎదిగింది. ఇది రిఫరెన్స్ లైబ్రరీ, రిసోర్స్ సెంటర్‌గా హయ్యర్ ఎడ్యుకేషన్‌లోని విద్యార్థులకు/ పరిశోధకులకు/అధ్యాపక సభ్యులకు దాని సేవలను అందిస్తుంది. ఉన్నత విద్యపై నాలెడ్జ్ బేస్‌డ్‌గా పనిచేస్తుంది. ఇది ఉన్నత విద్యపై జాతీయ, అంతర్జాతీయ పుస్తకాలు, జర్నల్స్ కలిగి ఉన్న గొప్ప గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో 25,000 కంటే ఎక్కువ పుస్తకాలు, 150 ప్రస్తుత పత్రికలు అందుబాటులో ఉన్నా యి. ‘థీసెస్ ఆఫ్ ది మంత్’ అనే కాలమ్ క్రింద సైన్స్ & టెక్నాలజీ, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ రంగంలో భారతీయ విశ్వవిద్యాలయాలు ఆమోదించిన డాక్టోరల్ థీసెస్‌పై గ్రంథ పట్టిక సమాచారాన్ని ఈ గ్రంథాలయం ద్వారానే అందిస్తారు. అం తర్జాతీయ యవనికపై భారత ఉన్నత విద్యా వ్యవస్థను రెపరెపలాడించడంలో అద్భుతమైన పాత్ర ను ఈ సంస్థ పోషిస్తున్నది.
- డా. రవి కుమార్ చేగోని
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం
98669 28327