జాతి వివక్ష వ్యాఖ్యలు.. ఫుట్‌బాలర్‌పై బ్యాన్

దిశ, స్పోర్ట్స్ : మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రైకర్ ఎడిన్‌సన్ కవానిపై ఫుట్‌బాల్ అసోసియేషన్ మూడు మ్యాచ్‌ల బ్యాన్ విధించింది. నవంబర్ 29 సౌతాంప్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ గెలిచిన తర్వాత కవాని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ‘నిగ్రిటో’ అనే కామెంట్ పెట్టాడు. ఇంగ్లీషులో దీనికి ‘పొట్టి నల్లవాడు’ అనే అర్దం ఉన్నది. ఈ పోస్టుపై పలు విమర్శలు రావడమే కాకుండా, జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడంటూ అతడిపై ఫిర్యాదులు అందాయి. కాగా, ఆ పోస్టును డిలీట్ […]

Update: 2021-01-01 10:27 GMT

దిశ, స్పోర్ట్స్ : మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రైకర్ ఎడిన్‌సన్ కవానిపై ఫుట్‌బాల్ అసోసియేషన్ మూడు మ్యాచ్‌ల బ్యాన్ విధించింది. నవంబర్ 29 సౌతాంప్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ గెలిచిన తర్వాత కవాని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ‘నిగ్రిటో’ అనే కామెంట్ పెట్టాడు. ఇంగ్లీషులో దీనికి ‘పొట్టి నల్లవాడు’ అనే అర్దం ఉన్నది. ఈ పోస్టుపై పలు విమర్శలు రావడమే కాకుండా, జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడంటూ అతడిపై ఫిర్యాదులు అందాయి. కాగా, ఆ పోస్టును డిలీట్ చేసే ముందు కవాని ఒక వివరణ ఇచ్చాడు.

‘తాను ఉరుగ్వేకు చెందిన వాడను. తనకు ఇంగ్లీష్ భాషపై పెద్దగా పట్టులేదు. తాను అనుకోకుండా ఆ మాటను వాడాను. అది ఒక స్నేహితుడిని ప్రేమగా పిలచే పదమనుకునే దాన్ని వాడాను’ అని చెప్పాడు. అంతే కాకుండా ఆ పోస్టుపై అతడు క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే తాను ప్రత్యక్ష విచారణకు రాలేనని పేర్కొన్నాడు. దీంతో ఫుట్‌బాల్ అసోసియేషన్ అతడికి 1 లక్ష పౌండ్ల జరిమానాతో పాటు మూడు మ్యాచ్‌ల బ్యాన్ విధించింది.

Tags:    

Similar News