తబ్లిగీ జమాత్ నేతపై ఈడీ కేసు

న్యూఢిల్లీ: తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కాంధల్వీ‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సాద్‌తో పాటు అతని అనుచరులపైనా ఈసీఐఆర్(ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్టు)ను నమోదు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించి నిజామూద్దీన్ ప్రాంతంలో మత సమ్మేళనం నిర్వహించారనే కారణంతో ఇప్పటికే మౌలానాపై […]

Update: 2020-04-16 21:12 GMT

న్యూఢిల్లీ: తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కాంధల్వీ‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సాద్‌తో పాటు అతని అనుచరులపైనా ఈసీఐఆర్(ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్టు)ను నమోదు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించి నిజామూద్దీన్ ప్రాంతంలో మత సమ్మేళనం నిర్వహించారనే కారణంతో ఇప్పటికే మౌలానాపై హత్య కేసు నమోదైన విషయం తెలిసిందే.

Tags:Tablighi Jamaat, Maulana Saad Kandhalvi, ED, case

Tags:    

Similar News