చైనా ఆరోపణలకు ఈక్వెడార్ స్ట్రాంగ్ కౌంటర్ 

దిశ, వెబ్ డెస్క్: చైనా వరుసగా వివిధ దేశాల నుండి తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఫుడ్ ప్యాకింగ్స్ (food packings) లపై కరోనా వైరస్ ను గుర్తించినట్లు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈక్వెడార్ రొయ్యల దిగుమతిపై కూడా కరోనా ఆరోపణలు చేసింది చైనా. ప్రపంచంలో అనేక దేశాలకు రొయ్యలు ఎగుమతి (prawns export) చేస్తోంది ఈక్వెడార్. ఇప్పటివరకు ఏ దేశం నుండి కూడా ఈ ఆరోపణలను ఎదుర్కోలేదు. కాగా ఈక్వెడార్ నుండి దిగుమతి చేసుకున్న రొయ్యల ప్యాక్ లో కరోనా వైరస్ […]

Update: 2020-08-14 07:49 GMT

దిశ, వెబ్ డెస్క్: చైనా వరుసగా వివిధ దేశాల నుండి తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఫుడ్ ప్యాకింగ్స్ (food packings) లపై కరోనా వైరస్ ను గుర్తించినట్లు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈక్వెడార్ రొయ్యల దిగుమతిపై కూడా కరోనా ఆరోపణలు చేసింది చైనా.

ప్రపంచంలో అనేక దేశాలకు రొయ్యలు ఎగుమతి (prawns export) చేస్తోంది ఈక్వెడార్. ఇప్పటివరకు ఏ దేశం నుండి కూడా ఈ ఆరోపణలను ఎదుర్కోలేదు. కాగా ఈక్వెడార్ నుండి దిగుమతి చేసుకున్న రొయ్యల ప్యాక్ లో కరోనా వైరస్ ఉన్నట్టు అధికారులు గుర్తించారని చైనా చేసిన ఆరోపణలకు ఈక్వెడార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

ఈక్వెడార్ ప్రొడక్షన్ మంత్రి స్పందిస్తూ… మా దేశంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ, నియమాలు పాటిస్తూనే ఎగుమతులు చేస్తున్నాం. మా దేశం దాటి వెళ్లిన వస్తువులకు ఏమౌతుందనే బాధ్యత మాది కాదు’ అని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News