ఉపాధి కల్పించే రంగాలను ఆదుకోవాలి!

ముంబయి: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోనున్నదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొద్దిగా కోలుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఆర్థిక విధానాలతోపాటు రాజకీయ సహకారం కూడా ముఖ్యమేనని పేర్కొంటున్నారు. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టర్ నివేదిక ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ 3.2శాతం ప్రతికూల వృద్ధి నమోదు చేస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పుంజుకోవచ్చని అంచనా వేసింది. జీడీపీ […]

Update: 2020-06-14 06:58 GMT

ముంబయి: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోనున్నదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొద్దిగా కోలుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఆర్థిక విధానాలతోపాటు రాజకీయ సహకారం కూడా ముఖ్యమేనని పేర్కొంటున్నారు. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టర్ నివేదిక ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ 3.2శాతం ప్రతికూల వృద్ధి నమోదు చేస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పుంజుకోవచ్చని అంచనా వేసింది. జీడీపీ తగ్గితే ఆ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై ఉండనుంది. ఆదాయాలు తగ్గి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సరైన విధానాలు రూపొందించాలని, అప్పుడే త్వరగా కోలుకొనే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం మాత్రమే మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రెండు మూడేళ్లలో వ్యవసాయ రంగంలో వృద్ధి సాధారణ సగటు కంటే ఎక్కువ ఉండనున్నదని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నిర్మాణ రంగం అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణరంగం నష్టపోతే ఉపాధి కల్పన కూడా అంతేస్థాయిలో నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ప్రభుత్వం తోడ్పాటునివ్వడం ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కాపాడుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News