కరోనా నిబంధనలు పాటించకపోతే నిషేధమే.. రాజకీయ నాయకులకు వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ పార్టీలు, నాయకులకు కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, సమావేశాల్లో కరోనా నిబంధనలు పాటించకపోతే వాటిపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దేశంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులకు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, ర్యాలీలలో భౌతికదూరం పాటించాలని, అందరూ మాస్కులు ధరించాలని ఆదేశించింది. సభపై మాట్లాడే స్టార్ క్యాంపెయినర్లు, నాయకులు కూడా […]
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ పార్టీలు, నాయకులకు కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, సమావేశాల్లో కరోనా నిబంధనలు పాటించకపోతే వాటిపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దేశంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులకు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, ర్యాలీలలో భౌతికదూరం పాటించాలని, అందరూ మాస్కులు ధరించాలని ఆదేశించింది.
సభపై మాట్లాడే స్టార్ క్యాంపెయినర్లు, నాయకులు కూడా మాస్కులు ధరించాలని లేఖలో ఈసీ పేర్కొంది. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలపై నిషేధం విధించడానికి వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చింది. మాస్కులు ధరించాల్సిందిగా, భౌతికదూరం పాటించాల్సిందిగా, శానిటైజర్ వాడాల్సిందిగా తమ మద్దతుదారులకు రాజకీయ నాయకులు అవగాహన కల్పించాలని కోరింది.