హుజూరాబాద్ ఎన్నికకి గుర్తులు సిద్ధం చేసిన ఈసీ

దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. బుధవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవడంతో ఈసీ తదుపరి కార్యచరణ చేపట్టింది. ఉపసంహరణలు పూర్తయ్యాక హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది ఈ క్రమంలో 30 మందికి ఎన్నికల కమిషన్ గుర్తులను ఖరారు చేసింది. ప్రధానంగా బరిలో ఉన్న అభ్యర్థులు ఈటల రాజేందర్‌కు కమలం పువ్వు గుర్తు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కారు గుర్తు, బల్మూరి వెంకట్‌కు […]

Update: 2021-10-13 08:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. బుధవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవడంతో ఈసీ తదుపరి కార్యచరణ చేపట్టింది. ఉపసంహరణలు పూర్తయ్యాక హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది ఈ క్రమంలో 30 మందికి ఎన్నికల కమిషన్ గుర్తులను ఖరారు చేసింది. ప్రధానంగా బరిలో ఉన్న అభ్యర్థులు ఈటల రాజేందర్‌కు కమలం పువ్వు గుర్తు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు కారు గుర్తు, బల్మూరి వెంకట్‌కు చేతి గుర్తులు ఉండగా.. మిగతా 27 మందికి వివిధ గుర్తులను కేటాయించారు. అయితే, దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఈవీఎంల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.

Tags:    

Similar News