గుడ్‌న్యూస్: బరువు తగ్గడానికి ‘కోకోవా’ తినండి!

దిశ, ఫీచర్స్: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కొన్ని కోట్ల మందిని వేధిస్తున్న సమస్య స్థూలకాయం. అధిక బరువు పెరిగిన వారు కొవ్వును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఊబకాయులు స్వీట్స్, చాక్లెట్స్ చాలా ఇష్టంతో తింటారాని, వాటివల్లే బరువు పెరుగుతారని భావించాం. కానీ ఒక కొత్త అధ్యయనంలో ఫ్యాట్‌తో బాధపడుతున్న వ్యక్తులు ఒక కప్పు ‘కోకోవా’ (చాక్లెట్లను తయారుచేసే ప్రాధమిక భాగం) తీసుకుంటే బరువు తగ్గుతారని, అంతేకాకుండ అధిక కొలెస్ర్టాల్ ఆహారం తిన్న ఫ్యాట్ దరిచేరదని […]

Update: 2021-06-09 04:28 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కొన్ని కోట్ల మందిని వేధిస్తున్న సమస్య స్థూలకాయం. అధిక బరువు పెరిగిన వారు కొవ్వును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఊబకాయులు స్వీట్స్, చాక్లెట్స్ చాలా ఇష్టంతో తింటారాని, వాటివల్లే బరువు పెరుగుతారని భావించాం. కానీ ఒక కొత్త అధ్యయనంలో ఫ్యాట్‌తో బాధపడుతున్న వ్యక్తులు ఒక కప్పు ‘కోకోవా’ (చాక్లెట్లను తయారుచేసే ప్రాధమిక భాగం) తీసుకుంటే బరువు తగ్గుతారని, అంతేకాకుండ అధిక కొలెస్ర్టాల్ ఆహారం తిన్న ఫ్యాట్ దరిచేరదని పరిశోధనలో వెల్లడైంది.

న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కోకో పౌడర్‌ను డైటరీ సప్లిమెంట్‌గా ఎలుకలకు ఇవ్వగా, వాటి డీఎన్ఏ డ్యామేజ్ తగ్గుతూ.. కాలేయంలోని కొవ్వు పరిమాణం కూడా తగ్గింది. సాధారణంగా చాక్లెట్ తయారీకి ప్రాధమిక పదార్థంగా కోకోవాను ఉపయోగిస్తారు. అయితే ఇన్నాళ్లుగా దీన్ని అనారోగ్య కారకంగా భావించినప్పటికీ, కోకోవాలో ఫైబర్, ఐరన్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయని తెలిపారు. అంతేకాదు కోకోవా మొక్కల్లో ఉంటే కెమికల్ కంపౌండ్స్ రోగనిరోధక వ్యవస్థకు సాయపడటంతో పాటు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ఆర్థరైటిస్, స్ట్రోక్, గుండె జబ్బులు, టైప్ -2 డయాబెటిస్ వంటి కార్డియో-మెటబాలిక్ వ్యాధులను నయం చేయడంలో ఇది ఉపయోగపడుతుందని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలోని ప్రొఫెసర్ జోషువా లాంబెర్ట్ వెల్లడించారు.

ఈ అధ్యయనం కోసం కాలేయ వ్యాధి సోకిన అధిక బరువున్న ఎలుకలకు ఒక గ్రాము ఆహారానికి (అధిక కొవ్వు ఉన్న ఆహారపదార్ధాలు) 80 మిల్లీగ్రాముల కోకో పౌడర్‌ను అందించారు పరిశోధకులు. వాటిలో ఫ్యాటీ లివర్ డిసీజ్‌లోని మార్పులు, ఆక్సీడేటివ్ స్ట్రెస్, యాంటీఆక్సిడెంట్ రెస్పాండ్ వంటి విషయాలను గమనిస్తూ.. సెల్ డ్యామేజ్‌ను పర్యవేక్షించారు. కోకోవా సప్లిమెంట్‌ను అందించని అధిక కొవ్వు తినిపించిన ఎలుకలతో పోలిస్తే, కోకోవా సప్లిమెంట్స్‌ తీసుకున్న ఎలుకలు 21 శాతం తక్కువ రేటుతో బరువు పెరిగాయని.. ఎనిమిది వారాల అధ్యయనంలో కోకోవా ఆహారం ఇవ్వని ఎలుకలతో పోలిస్తే, దాన్ని స్వీకరించిన ఎలుకలకు 28 శాతం తక్కువ కొవ్వు కలిగి ఉన్నాయని పరిశోధనలో కనుగొన్నారు.

కోకోవా తినే ఎలుకలలో 56 శాతం తక్కువ ఆక్సీకరణ ఒత్తిడితో పాటు, అధిక కొవ్వు ఉన్న ఎలుకల కాలేయంలో 75 శాతం తక్కువ డిఎన్‌ఎ ఉందని వారు కనుగొన్నారు. ప్రొఫెసర్ లాంబెర్ట్ గత అధ్యయనంలో కోకోవా పౌడర్‌లోని కొన్ని రసాయనాలు ఆహారంలో కొవ్వు జీర్ణమయ్యే ఎంజైమ్‌లు నిరోధిస్తుందని చూపించింది.

మానవ శరీరంపై కోకోవా ప్రభావాలను మరింత పరిశోధించాలని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా ఆల్కహాలిక్ సంబంధిత కొవ్వు కాలేయ వ్యాధిపై దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఈ అధ్యయనం అధిక బరువున్న వారికి ఊరటనిచ్చే విషయం. ఫిజికల్ యాక్టివిటీతో పాటు, హెల్తీ డైట్ తీసుకునే వారికి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇకపై శారీరక శ్రమ చేస్తూ, ఓ కప్పు కోకోవా తీసుకుంటే.. తక్కువ వ్యవధిలోనే బరువు తగ్గొచ్చు’. – జోషువా లాంబెర్ట్, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసర్

Tags:    

Similar News