ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదం…

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన విషయం తెలసిందే. ఈమేరకు ఈటల రాజేందర్ రాజీనామా పత్రాన్ని స్పీకర్ వద్దకు అసెంబ్లీ కార్యదర్శి తీసుకు వెళ్ళడంతో ఈటల రాజీనామాను వెంటనే స్పీకర్ ఆమోదించారు. దీంతో పాటు హుజురాబాద్ నియోజకవర్గo ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు హుజూరాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు ప్రకటించారు. దీంతో హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం […]

Update: 2021-06-12 03:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన విషయం తెలసిందే. ఈమేరకు ఈటల రాజేందర్ రాజీనామా పత్రాన్ని స్పీకర్ వద్దకు అసెంబ్లీ కార్యదర్శి తీసుకు వెళ్ళడంతో ఈటల రాజీనామాను వెంటనే స్పీకర్ ఆమోదించారు. దీంతో పాటు హుజురాబాద్ నియోజకవర్గo ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు హుజూరాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు ప్రకటించారు. దీంతో హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈటల సోమవారం బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు మరికొంత మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ లో ఉప‌ఎన్నికలకు అన్ని పార్టీల నాయకులు పావులు కదుపుతున్నారు.

Tags:    

Similar News