హుజురాబాద్ ఫలితంతో కేసీఆర్‌లో అసహనం : ఈటల రాజేందర్ ఫైర్

దిశ ప్రతినిధి, నల్లగొండ : హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలో పలు కార్యక్రమాలకు వెళ్తున్న ఈటల రాజేందర్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అసహనం మొత్తం రైతులపై చూపి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు. కేంద్ర […]

Update: 2021-11-27 23:40 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ : హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలో పలు కార్యక్రమాలకు వెళ్తున్న ఈటల రాజేందర్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అసహనం మొత్తం రైతులపై చూపి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల నుండి తెలంగాణ ధాన్యం పూర్తిగా కొన్నదని పేర్కొన్నారు. రైతాంగం పండించిన ధాన్యం మీద మొత్తం పెట్టుబడి కేంద్రమే పెడుతున్నదని చెప్పారు. కేంద్రం రా రైస్ మాత్రమే తీసుకుంటామని తెలిపిందని, దంపుడు బియ్యం వద్దని చెప్పిందని, దీనికి రాష్ట ప్రభుత్వం కూడా ఒప్పుకుందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనకపోవడంతో రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, రాజకీయాలు పక్కన పెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి రైతుల ధాన్యం ఎందుకు కొనలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయమని ముందే చెప్పినా.. ప్రత్యాన్మయ చర్యలు తీసుకోకుండా మొద్దు నిద్రలో ముఖ్యమంత్రి ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో పోలీసులను వాడుకొని ముఖ్యమంత్రి దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నాడని, రానున్న రోజులలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. రాజేందర్‌కు ఘన స్వాగతం పలికిన వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, యాదాద్రి జిల్లాధ్యక్షుడు శ్యామ్ సుందర్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

 

Tags:    

Similar News