సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఈటల.. ‘ఓటీ’ బ్యాచ్‌ను ఏకం చేస్తాడా.?
దిశ ప్రతినిధి, కరీంనగర్/ కరీంనగర్ సిటీ : హుజురాబాద్ బై పోల్స్‌లో విజయ ఢంకా మోగించిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకతను సంతరించుకోనున్నారు. రానున్న రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో ఈటల కేంద్ర బిందువుగా మారనున్నారు. బీసీ నాయకుడు కావడంతో పాటు ఉద్యమనేత కూడా కావడంతో కమలనాథులు కూడా ఈటలను అస్త్రంగా వినియోగించుకోనున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే ప్రచార అస్రాలుగా రాజేందర్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటించే అవకాశాలు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్/ కరీంనగర్ సిటీ : హుజురాబాద్ బై పోల్స్‌లో విజయ ఢంకా మోగించిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకతను సంతరించుకోనున్నారు. రానున్న రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో ఈటల కేంద్ర బిందువుగా మారనున్నారు. బీసీ నాయకుడు కావడంతో పాటు ఉద్యమనేత కూడా కావడంతో కమలనాథులు కూడా ఈటలను అస్త్రంగా వినియోగించుకోనున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే ప్రచార అస్రాలుగా రాజేందర్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటించే అవకాశాలు ఉన్నాయి.
ఓటీ బ్యాచ్ సమైఖ్యత కోసం..
స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత రాష్ట్రంలో నాయకులు రెండు రకాలుగా విభజించబడ్డారు. ఉద్యమ ప్రస్థానంలో కీలకంగా పనిచేసిన వారిని ఒరిజినల్ తెలంగాణ(ఓటీ) బ్యాచ్ అని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన పంచన చేరిన వారిని బంగారు తెలంగాణ (బీటీ) బ్యాచ్ అని పిలుస్తున్నారు. ఈటల కూడా గతంలో అణిచివేతకు గురైన వారిలాగా నలిగిపోయి సీఎం కేసీఆర్‌ను ఎదురొడ్డి విజయం సాధించినందున ఆయన నేతృత్వంలో ఓటీ బ్యాచ్‌ను అంతా కూడా ఒకే వేదికపైకి చేర్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలకు కూడా ఈటల సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచే అవకాశాలు లేకపోలేదు.
నాడు కిరణ్ నేడు కేసీఆర్..
నిన్నటి వరకూ ఉద్యమనేత వెన్నంటి నడిచిన ఈటల ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు. ఉద్యమ కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎండగట్టిన విధంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఏకిపారేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, నిరుద్యోగం, ఉద్యోగుల కష్టాలతో పాటు ఉద్యమకారుల కుటుంబాల సంక్షేమం తదితర అంశాలను లేవనెత్తే అవకాశాలు ఉంటాయి.