లద్దాఖ్‎లో భూప్రకంపనలు

దిశ, వెబ్‎డెస్క్: లద్దాఖ్‌‎లో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారు జామున 4.44 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతగా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. కాగా, హిమాలయ ప్రాంతంలో గత 15 రోజుల్లో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి. అంతకు ముందు అక్టోబర్‌ 8న రిక్టర్‌ స్కేల్‌పై 4.2 తీవ్రతతో కార్గిల్‌లో, 5.1 తీవ్రతతో లేహ్‌లో భూకంపం వచ్చింది. కాగా, భూకంపంతో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదని అధికారులు […]

Update: 2020-10-18 21:07 GMT

దిశ, వెబ్‎డెస్క్: లద్దాఖ్‌‎లో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారు జామున 4.44 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతగా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. కాగా, హిమాలయ ప్రాంతంలో గత 15 రోజుల్లో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి.

అంతకు ముందు అక్టోబర్‌ 8న రిక్టర్‌ స్కేల్‌పై 4.2 తీవ్రతతో కార్గిల్‌లో, 5.1 తీవ్రతతో లేహ్‌లో భూకంపం వచ్చింది. కాగా, భూకంపంతో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News