హైదరాబాద్‌లో కంపించిన భూమి
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో బుధవారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో భూమి కంపించింది. కూకట్‌పల్లిలో అస్బెస్టాస్ కాలనీ రోడ్ నెంబర్ 2లో భూ క్రంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పెద్ద శబ్దాలతో రెండుసార్లు భూమి కంపించిందని, వెంటనే భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు పేర్కొన్నారు. దాదాపు నాలుగు సెకన్లపాటు వైబ్రేషన్స్ వచ్చాయని కాలనీ వాసులు వెల్లడించారు. అటు బోరబండ, గచ్చిబౌలి ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని స్థానిక కాలనీ వాసులు వెల్లడించారు.