వ్యాపార వనరుగా ‘బ్లాగింగ్’.. ట్రాఫిక్‌తో ఆటోమేటిక్‌గా ఆదాయం

దిశ, ఫీచర్స్ : కొన్ని ప్రాథమిక నైపుణ్యాలు ఉంటే చాలు.. డబ్బు, కీర్తిని సంపాదించడానికి ఇంటర్నెట్‌ను మించిన వేదిక లేదంటే అతిశయోక్తి కాదేమో. మొబైల్ తెరిస్తే లెక్కలేనన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టిక్‌టాక్ వంటి వాటిల్లో కంటెంట్ క్రియేటర్‌గా కాస్త క్లిక్ అయితే చాలు జీవితం మలుపు తిరుగుతోంది. మనకు ఇష్టమైన పని చేసుకుంటూ, ఆదాయం పొందే ఉత్తమమైన మార్గాల్లో ‘బ్లాగింగ్’ కూడా ఒకటి. చాలామందికి డైరీ రాసే […]

Update: 2021-05-24 20:25 GMT

దిశ, ఫీచర్స్ : కొన్ని ప్రాథమిక నైపుణ్యాలు ఉంటే చాలు.. డబ్బు, కీర్తిని సంపాదించడానికి ఇంటర్నెట్‌ను మించిన వేదిక లేదంటే అతిశయోక్తి కాదేమో. మొబైల్ తెరిస్తే లెక్కలేనన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టిక్‌టాక్ వంటి వాటిల్లో కంటెంట్ క్రియేటర్‌గా కాస్త క్లిక్ అయితే చాలు జీవితం మలుపు తిరుగుతోంది. మనకు ఇష్టమైన పని చేసుకుంటూ, ఆదాయం పొందే ఉత్తమమైన మార్గాల్లో ‘బ్లాగింగ్’ కూడా ఒకటి. చాలామందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. అలాగే ఆన్‌లైన్ వేదికగా కాస్త వివరించి, ఎక్స్‌ప్లోర్ చేసి రాయడమే ‘బ్లాగింగ్’. ఇందులో ఆదాయం సంపాదించేందుకు టెక్ నిపుణులు సూచిస్తున్న చిట్కాలేంటి, బ్లాగింగ్ మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఆ విషయాలు తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌లో ఇన్‌ఫార్మల్ డైరీ-స్టైల్ టెక్స్ట్ ఎంట్రీలతో కూడిన చర్చ లేదా సమాచార వెబ్‌సైట్‌ను ‘బ్లాగ్’‌గా చెప్పొచ్చు. ‘బ్లాగ్స్’ ఇండివిడ్యుయల్‌గా లేదా సమూహంగా రాసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘బ్లాగింగ్’ మనవైన మాటలతో ఓ వెబ్‌సైట్‌ను సృష్టించుకోవడం. ఇక్కడ ఆసక్తి ఉన్న విషయాల గురించి ఎంతైనా రాసుకోవచ్చు. ఓ విషయాన్ని ఎంత సూటిగా, స్పష్టంగా, వాస్తవంగా చెప్పావో దాని మీద ఆధారపడి ‘బ్లాగ్’‌కు రీచబులిటీ పెరుగుతోంది. మన అభిరుచే ఇక్కడ పెట్టుబడి. ఉదాహరణకు.. ట్రావెలర్‌గా నువ్వు తిరిగే ప్రదేశాల విశేషాలు, అక్కడి ప్రత్యేకతలు, ఎక్స్‌క్లూజివ్ అంశాలను అక్షరబద్దం చేస్తూ ‘బ్లాగ్’ రాస్తే ఎంతోమంది ట్రావెలర్స్‌, ట్రావెలింగ్‌ను ఇష్టపడే వాళ్ల బ్లాగ్ ఫాలోవర్స్‌గా మారిపోతారు.

ఇలా కిచెన్, గార్డెన్, పాటలు, కవితలు బోలెడు అంశాలు. అత్యంత ప్రాచుర్యం పొందిన బ్లాగింగ్ నీచెస్‌లో పర్సనల్ ఫైనాన్స్, అభివృద్ధి, ఆరోగ్యం, ఫిట్‌నెస్, అందం, ఫ్యాషన్‌లతో పాటు అందరికీ ఇష్టమైన ‘ఫుడ్’ బ్లాగు‌లు ఉన్నాయి. ఈ క్రమంలో బ్లాగ్‌కు ట్రాఫిక్‌ పెరిగితే ఆదాయం కూడా మొదలవుతుంది. రాత్రికే రాత్రే ‘బ్లాగ్’.. బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోదు. దానికి సమయం పడుతుంది. బ్లాగ్ సక్సెస్‌కు ప్రధానంగా ఓపిక అవసరం. బ్లాగింగ్ అనేది ఆర్ట్ అండ్ సైన్స్ కలయిక. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, కృషి, బలమైన సంకల్ప శక్తితో ముందుకు పోవాలి.

బ్లాగ్ ద్వారా మనీ ఎర్నింగ్ : బ్లాగింగ్ నేర్చుకోవడం చాలా కష్టమైన పనేం కాకపోయినా.. బ్లాగ్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ముందుగా ఒక బ్లాగును ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత కంటెంట్‌ను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుండాలి. టార్గెట్ ఆడియన్స్‌ను రీచ్ అవుతూ కస్టమర్లతో ఎంగేజ్ కావాలి.

అడ్వర్టైజింగ్ : మీ బ్లాగులో స్పాన్సర్డ్ పోస్ట్‌లను అంగీకరించడం ప్రారంభించండి. పెయిడ్ టెస్ట్ లింక్స్, వీడియో, పోడ్‌కాస్ట్ ప్రకటనలను అంగీకరించండి. కాంపిటీషన్స్ నిర్వహిస్తూ బహుమతులు ఇవ్వండి

సర్వీసెస్ : డిజైన్, కోచింగ్, కన్సల్టింగ్, ఫ్రీలాన్సింగ్, స్పీకింగ్, కాపీ రైటింగ్ వంటి సొంత సేవలను రీడర్స్‌కు అందించండి.

అఫిలియేట్ మార్కెటింగ్ : అఫియలెట్ నెట్‌వర్స్క్, ప్రోగ్రామ్‌లకు సైన్ అప్ చేయండి. లింక్‌లను నిరంతరం ప్రోత్సహించేలా చూసుకోవాలి. ప్రస్తుత సమయంలో ‘అఫిలియేట్ మార్కెటింగ్’ ద్వారా ఆదాయం మంచిగా సంపాదించొచ్చు.

ప్రొడక్ట్స్ : బ్లాగులో యాప్, ఈ బుక్‌లు, బోధనా సామగ్రి, కోర్సులు, వస్తువులు మొదలైన ఉత్పత్తులను అమ్మవచ్చు.
అదర్ వేస్ : ఇతర బ్లాగులను అమ్మడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు

కొన్ని సంవత్సరాల క్రితం బ్లాగింగ్ అభిరుచిగా కొనసాగింది. కానీ గత కొన్నేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి వారి ఉద్యోగాలు, అధ్యయనాలు, ఇతర పనులతో పాటు ఒక వ్యాపారంగా బ్లాగింగ్ ప్రారంభించారు. కాబట్టి వెబ్‌సైట్ ట్రాఫిక్‌ను పొందినప్పుడు లేదా గుర్తింపు పొందడం ప్రారంభించినప్పుడు ఆదాయం సంపాదించే మార్గాలవైపు పూర్తిగా దృష్టి పెడతారు. బ్లాగింగ్‌ను ప్రధాన ఆదాయ వనరుగా తీసుకోవడం సరైన పద్ధతి కాదు. విజయవంతమైన బ్లాగర్ కావడానికి చాలా సమయం పడుతుందని గుర్తెరగాలి.

ఫీచర్స్ :
* బ్లాగ్ ఎప్పుడూ స్థిరంగా ఉండకూడదు. ఇది ఎల్లప్పుడూ న్యూ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్(సమాచారం) అందిస్తూ ఉండాలి.
* వెబ్ పేజీ రూపకల్పన ఆకర్షించాలి. చాలా బ్లాగులు ఒకే వెబ్ పేజీ డిజైన్లను కలిగి ఉంటాయి. అలాకాకుండే యూనిక్‌గా ఉండాలి.
* కంటెంట్ ఎంత బాగుంటే ‘బ్లాగ్’ అదే రేంజ్‌లో సక్సెస్ అవుతుంది. బ్లాగర్లు మంచి కంటెంట్‌ అందివ్వడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి.
* మెయిన్ హెడ్‌లైన్స్ ఆట్రాక్టివ్‌గా ఉండాలి. ఇవే మొత్తం కథనాన్ని పాఠకుడిని చదివేలా చేయడంలో దొహదపడుతుంది.
* ప్రామాణికమైన, వాస్తవమైన కంటెంట్ అందించాలి.
* లింక్ బిల్డింగ్ కూడా చాలా ప్రధానం
* బ్లాగ్ కమ్యూనికేట్ చేసే విధానం, చర్చను ప్రోత్సహించే తీరుపైన దీని సక్సెస్ ఆధారపడుతుంది. టార్గెట్ ఆడియన్స్‌తో ఎల్లప్పుడూ కనెక్ట్ అవ్వాలి.
* కంటెంట్ పర్‌ఫెక్ట్ లెంగ్త్‌తో ముగించడం ప్రధానం. బ్లాగులో రాయాలనుకుంటున్న అంశాల గురించి రీసెర్చ్ చేయడంతోపాటు, మంచి జ్ఞానాన్ని అందించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను మిస్ లీడ్ చేయొద్దు. యూజర్లకు ‘బ్లాగ్’ ఓ గొప్ప జ్ఞాన వనరుగా ఉండాలి.

ఎన్ని చిట్కాలు పాటించినా, బ్లాగుతో ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి సమయం, సహనం అవసరం. ఏదైనా బ్లాగ్‌లో రాసే ముందు మరింత చదవండి. మరింత సమాచారం సేకరించండి. డబ్బు గురించి ఆలోచించే ముందు మొదట సైట్‌ను సరైన స్థితికి తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. సైట్ ర్యాంకింగ్ మొదలైన తర్వాత ట్రాఫిక్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆ తర్వాత బ్లాగుతో డబ్బు సంపాదించడం చాలా సులభమని గుర్తుంచుకోండి.

 

Tags:    

Similar News