తెలంగాణకు ‘ఈ-పంచాయత్ పురస్కార్’
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరో అవార్డును చేజిక్కించుకుంది. గ్రామ పంచాయతీల్లో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉండటంతో ఈ అవార్డును అందించినట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయకుమార్ బెహరా బుధవారం ప్రకటించారు. ప్రతి ఏటా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ-పంచాయత్ పురస్కారాలను అందజేస్తుండగా 2019-20 సంవత్సరానికి గాను ఈ-అవార్డు తెలంగాణకు దక్కడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరో అవార్డును చేజిక్కించుకుంది. గ్రామ పంచాయతీల్లో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉండటంతో ఈ అవార్డును అందించినట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయకుమార్ బెహరా బుధవారం ప్రకటించారు. ప్రతి ఏటా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ-పంచాయత్ పురస్కారాలను అందజేస్తుండగా 2019-20 సంవత్సరానికి గాను ఈ-అవార్డు తెలంగాణకు దక్కడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రెబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలిచాయి.