36 శాతం పెరిగిన ఈ-కామర్స్ ఆర్డర్లు
దిశ, వెబ్‌డెస్క్: 2020 ఏడాది చివరి త్రైమాసికంలో దేశీయంగా ఈ-కామర్స్ ఆర్డర్లు 36 శాతం పెరిగాయని, ఇందులో ఎక్కువగా వ్యక్తిగత రక్షణ, బ్యూటీ అండ్ వెల్నెస్ విభాగంలో ఎక్కువ ఆర్డర్లు జరిగాయని యూనికామర్స్, కిర్నీ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక తెలిపింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వ్యక్తిగత రక్షణ, బ్యూటీ అండ్ వెల్నెస్ విభాగం 95 శాతం, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ విభాగం 46 శాతం వార్షిక వృద్ధిని సాధించాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా టైర్2, టైర్3 […]
దిశ, వెబ్‌డెస్క్: 2020 ఏడాది చివరి త్రైమాసికంలో దేశీయంగా ఈ-కామర్స్ ఆర్డర్లు 36 శాతం పెరిగాయని, ఇందులో ఎక్కువగా వ్యక్తిగత రక్షణ, బ్యూటీ అండ్ వెల్నెస్ విభాగంలో ఎక్కువ ఆర్డర్లు జరిగాయని యూనికామర్స్, కిర్నీ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక తెలిపింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వ్యక్తిగత రక్షణ, బ్యూటీ అండ్ వెల్నెస్ విభాగం 95 శాతం, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ విభాగం 46 శాతం వార్షిక వృద్ధిని సాధించాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా టైర్2, టైర్3 నగరాల్లో ఆర్డర్ల వార్షిక వృద్ధి 90 శాతం పెరిగిందని, బ్రాండ్ వెబ్‌సైట్లు 94 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ-కామర్స్ వృద్ధి వేగవంతమైంది. లాక్‌డౌన్ వంటి పరిణామాలతో వినియోగదారుల అలవాట్లలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎక్కువమంది దుకాణదారులుం, అమ్మకందారులు ఆన్‌లైన్ విభాగంలోకి ప్రవేశించారని నివేదిక అభిప్రాయపడింది. ఎలక్ట్రానిక్స్ విభాగం సగటు ఆర్డర్లు 12 శాతం, ఫ్యాషన్, సంబంధిత విభాగం 37 శాతం వృద్ధిని సాధించాయని తెలుస్తోంది. ఇప్పటికీ ప్రజలెక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తుండటంతో తక్కువ ధరల్లో లభించే సాధారణ దుస్తుల అమ్మకాలు ఆన్‌లైన్ విభాగంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. అంతేకాకుండా, లాక్‌డౌన్ కారణంగా మొదటిసారి ఆన్‌లైన్ కిరాణాదారులు పెరగడంతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలు ఆన్‌లైన్ కిరాణా విభాగంపై దృష్టి పెట్టేందుకు కారణమయ్యాయి.