పట్నం వదిలి.. సొంతూళ్లకు జనం

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలకు వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇంకా పలు కాలనీలు వరద ముంపులోనే మునిగిపోయాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రగతిగనర్ సుమారెసిడెన్సీ, పంచవటీ కాలనీ, సాయినగర్, విహారిక కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సీబీఎస్ నగర్, శ్రీపురం ఆలనీ, సత్యానగర్, ఇందిరానగర్, లాలాపేట్, సికింద్రాబాద్ సర్కిల్ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మైక్‌ల […]

Update: 2020-10-18 23:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలకు వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇంకా పలు కాలనీలు వరద ముంపులోనే మునిగిపోయాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రగతిగనర్ సుమారెసిడెన్సీ, పంచవటీ కాలనీ, సాయినగర్, విహారిక కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సీబీఎస్ నగర్, శ్రీపురం ఆలనీ, సత్యానగర్, ఇందిరానగర్, లాలాపేట్, సికింద్రాబాద్ సర్కిల్ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మైక్‌ల ద్వారా కూడా జీహెచ్‌ఎంసీ సిబ్బంది అనౌన్స్‌మెంట్ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పండుగ సమీపిస్తుండటంతో కాలనీలు ఖాళీ చేసి, జనాలు సొంతూళ్లకు వెళ్తున్నారు. రెండోసారి వచ్చిన వరద మరింత నష్టం చేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయకపోతే భవిష్యత్తు అంధకారమే అని నగర వాసులు అంటున్నారు.

Tags:    

Similar News