దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ వాసుల చిరకాల స్వప్నం త్వరలో నెరవేరనుంది. నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బెజవాడకు మణిహారంగా రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ సెప్టెంబర్ 4న ప్రారంభించబోతున్నట్లు మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. గురువారం ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో కలిసి ఫ్లై ఓవర్ పనులను మంత్రి తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయినట్లు తెలిపారు. కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ ఫ్లై […]
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ వాసుల చిరకాల స్వప్నం త్వరలో నెరవేరనుంది. నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బెజవాడకు మణిహారంగా రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ సెప్టెంబర్ 4న ప్రారంభించబోతున్నట్లు మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. గురువారం ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో కలిసి ఫ్లై ఓవర్ పనులను మంత్రి తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయినట్లు తెలిపారు.
కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌ను కూడా అదే రోజున ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. 4న ఆర్ అండ్ బీకి చెందిన 13 వేల కోట్ల రూపాయల పనులకు కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఒక వైపు సంక్షేమం, మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు.