తొమ్మిదేళ్ల సినీ కెరియర్.. ఎమోషనల్ అయిన దుల్కర్!
దిశ, సినిమా : ‘సెకండ్ షో’ సినిమా ద్వారా మాలీవుడ్‌కు పరిచయమైన దుల్కర్.. తనతో పాటు చాలా మంది న్యూ కమ్మర్స్‌కు అదే డెబ్యూ మూవీ అని తెలిపాడు. తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున తను కొత్త సినిమా ప్రారంభించానన్న దుల్కర్.. గందరగోళాలు, భయాలు ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు. కానీ సమయం తనకు సానుకూలంగా మారి సాయం చేసిందన్నారు. ‘మీ అందరి నుంచి వచ్చిన యానివర్సరీ రిమైండ్.. కెరియర్‌ను కొత్తగా ప్రారంభించిన రోజును గుర్తుచేసింది, చాలా జ్ఞాపకాలు […]
దిశ, సినిమా : ‘సెకండ్ షో’ సినిమా ద్వారా మాలీవుడ్‌కు పరిచయమైన దుల్కర్.. తనతో పాటు చాలా మంది న్యూ కమ్మర్స్‌కు అదే డెబ్యూ మూవీ అని తెలిపాడు. తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున తను కొత్త సినిమా ప్రారంభించానన్న దుల్కర్.. గందరగోళాలు, భయాలు ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు. కానీ సమయం తనకు సానుకూలంగా మారి సాయం చేసిందన్నారు. ‘మీ అందరి నుంచి వచ్చిన యానివర్సరీ రిమైండ్.. కెరియర్‌ను కొత్తగా ప్రారంభించిన రోజును గుర్తుచేసింది, చాలా జ్ఞాపకాలు నెమరవేసుకున్నాను’ అని తెలిపారు. కెరియర్‌ను ఎలా ప్రారంభించాను, ఎక్కడ నుంచి వచ్చానో ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానన్న దుల్కర్.. ఇందుకోసం నిరంతరం మద్దతిచ్చినందుకు, ప్రేమతో ఆదరించినందుకు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మాలీవుడ్‌తో పాటు అన్ని సినీ పరిశ్రమల కో స్టార్స్‌తో ఈ మ్యాజికల్ వరల్డ్‌లో పనిచేయడం విశేషంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా బెస్ట్ మూవీస్‌తో మీ అందరికీ ఉత్సాహాన్నిచ్చేలా ప్రయత్నిస్తానని ప్రామిస్ చేశాడు.