దుబ్బాక ఉప ఎన్నిక వారిద్దరి మధ్యే..!

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప ఎన్నికలు అభివృద్ధి కాముకుల, అభివృద్ధి విరోధులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న టీఆర్ఎస్ కావాలో, ఎన్నికలొస్తే తప్పా కనిపించని కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభివృద్ధి విరోధులు కావాలో మీరే తేల్చుకోవాలని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. దుబ్బాక అభ్యర్థిగా సోలిపేట సుజాతను సీఎం కేసీఆర్ ప్రకటించినప్పుడే ఆమె విజయం ఖాయమైందనీ […]

Update: 2020-10-14 06:35 GMT

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప ఎన్నికలు అభివృద్ధి కాముకుల, అభివృద్ధి విరోధులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న టీఆర్ఎస్ కావాలో, ఎన్నికలొస్తే తప్పా కనిపించని కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభివృద్ధి విరోధులు కావాలో మీరే తేల్చుకోవాలని ఆయన అన్నారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. దుబ్బాక అభ్యర్థిగా సోలిపేట సుజాతను సీఎం కేసీఆర్ ప్రకటించినప్పుడే ఆమె విజయం ఖాయమైందనీ అన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్దిని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు విశ్వ ప్రయత్నలు చేశాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్స్, బీజేపీ పార్టీలు గోబెల్ ప్రచారాలను చేస్తున్నాయని విమర్శించారు. వారికి ఓటు ద్వారానే ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలకు కేంద్రమే డబ్బులు ఇస్తోందని ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. తమ ప్రభుత్వం తెలంగాణలో 39లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నదనీ, దానికోసం 11వేల 720 కోట్లు ఖర్చు చేస్తున్నామనీ తెలిపారు. వీటి కోసం కేంద్రం ఇస్తున్నది కేవలం 210 కోట్లు మాత్రమేనన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా రైతుబందు, రైతు భీమా, కల్యాణ లక్ష్మీ లాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

 

Tags:    

Similar News