దుబ్బాకలో బీజేపీ నేత శ్రీనివాస్‌ అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న దుబ్బాక బీజేపీ నేత శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019లో టీఆర్ఎస్ గద్దె కూల్చిన వీడియోను వైరల్ చేయడంతో.. ఎన్నికల నియమావళికి విరుద్ధమంటూ టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దుబ్బాకలో జరగని విషయాన్ని జరిగినట్లు చూపిస్తున్నారని, వెంటనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని టీఆర్ఎస్ కోరడంతో.. విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారి పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే విచారణ జరిపిన పోలీసులు శ్రీనివాస్‌పై ఐటీ యాక్ట్ […]

Update: 2020-10-18 10:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న దుబ్బాక బీజేపీ నేత శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019లో టీఆర్ఎస్ గద్దె కూల్చిన వీడియోను వైరల్ చేయడంతో.. ఎన్నికల నియమావళికి విరుద్ధమంటూ టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దుబ్బాకలో జరగని విషయాన్ని జరిగినట్లు చూపిస్తున్నారని, వెంటనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని టీఆర్ఎస్ కోరడంతో.. విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారి పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే విచారణ జరిపిన పోలీసులు శ్రీనివాస్‌పై ఐటీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News