నీళ్లలోనే డీటీవో ఆఫీస్
దిశ, జనగామ: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జనగామ డీటీవో ఆఫీస్ నీటిలో మునిగిపోయింది. జనగామ-హైదరాబాద్ రోడ్డులోని కంబాల కుంట వద్ద 2016లో నిర్మించిన భవనం నీట మునగడంతో అధికారులపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయం కోసం రెండెకరాల స్థలాన్ని, సుమారు రూ.60 లక్షలకు పైగా నిధులు కేటా యించారు. భవనం నిర్మించేటప్పుడు వరదనీటిని అంచనా వేయకుండా ఆదర బాదరాగా నిర్మాణ పనులు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే భవనం ముంపునకు గురవుతోందని స్థానికులు […]
దిశ, జనగామ: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జనగామ డీటీవో ఆఫీస్ నీటిలో మునిగిపోయింది. జనగామ-హైదరాబాద్ రోడ్డులోని కంబాల కుంట వద్ద 2016లో నిర్మించిన భవనం నీట మునగడంతో అధికారులపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రవాణా శాఖ కార్యాలయం కోసం రెండెకరాల స్థలాన్ని, సుమారు రూ.60 లక్షలకు పైగా నిధులు కేటా యించారు. భవనం నిర్మించేటప్పుడు వరదనీటిని అంచనా వేయకుండా ఆదర బాదరాగా నిర్మాణ పనులు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే భవనం ముంపునకు గురవుతోందని స్థానికులు చెప్తున్నారు. పనులు పూర్తై సంవత్సరం గడుస్తున్నా అందులో ఎవరూ అడుగు పెట్టకపోవటం గమనార్హం.