జంపన్న ఉధృతి.. కుంగిన వంతెన
దిశ, ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తొలిసారిగా ములుగు జిల్లాలోని మేడారం జాతర ప్రాంగణం అంతటినీ జంపన్న వాగు ముంచెత్తింది. సామక్క-సారలమ్మ గద్దెల వరకు జంపన్న వాగు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామంలో కూడా జంపన్న వాగు ఉధృత రూపం దాల్చుతోంది. వరద ప్రవాహానికి ఏకంగా నాగారం- దొడ్ల గ్రామాల మధ్య ఉన్న వంతెన కుంగిపోయింది. దీంతో […]
దిశ, ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తొలిసారిగా ములుగు జిల్లాలోని మేడారం జాతర ప్రాంగణం అంతటినీ జంపన్న వాగు ముంచెత్తింది. సామక్క-సారలమ్మ గద్దెల వరకు జంపన్న వాగు వచ్చి చేరిన సంగతి తెలిసిందే.
అయితే, ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామంలో కూడా జంపన్న వాగు ఉధృత రూపం దాల్చుతోంది. వరద ప్రవాహానికి ఏకంగా నాగారం- దొడ్ల గ్రామాల మధ్య ఉన్న వంతెన కుంగిపోయింది. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు.