కరోనా వైరస్‌పై దాడికి డ్రోన్ స్ప్రే : మంత్రి ఎర్రబెల్లి
దిశ, వరంగల్: కరోనా వైరస్‌పై దాడి చేసేందుకు డ్రోన్ స్ప్రే ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంత్రి డ్రోన్ స్ప్రే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌పై ముప్పేట దాడి చేయడానికి ఈ డ్రోన్ స్ప్రే ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ డ్రోన్ స్ప్రేని వరంగల్, నర్సంపేట తదితర ప్రాంతాల్లో వినియోగించినట్టు గుర్తుచేశారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో మొదటిసారిగా డ్రోన్ స్ప్రేను […]
దిశ, వరంగల్: కరోనా వైరస్‌పై దాడి చేసేందుకు డ్రోన్ స్ప్రే ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంత్రి డ్రోన్ స్ప్రే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌పై ముప్పేట దాడి చేయడానికి ఈ డ్రోన్ స్ప్రే ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ డ్రోన్ స్ప్రేని వరంగల్, నర్సంపేట తదితర ప్రాంతాల్లో వినియోగించినట్టు గుర్తుచేశారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో మొదటిసారిగా డ్రోన్ స్ప్రేను వినియోగిస్తున్నట్టు మంత్రి చెప్పుకొచ్చారు. దీనిని అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ వినియోగిస్తామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
Tags: corona, lockdown,drone camera, spraying, minister errabelli