డ్రోన్ పరిశ్రమలో తయారీ, నియామకాలకు భారీ డిమాండ్

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కేంద్రం డ్రోన్ తయారీ పరిశ్రమల కోసం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న డ్రోన్ తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు తమ ఉత్పత్తుల ఆఫర్లను పెంచుతున్నారు. గత కొంతకాలంగా ఈ పరిశ్రమ వృద్ధి మెరుగ్గా ఉందని, తాజాగా పీఎల్ఐ పథకంతో మరింత వేగవంతంగా గిరాకీ పెరగనున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో డిమాండ్‌కు తగిన స్థాయిలో నియామకాలను కూడా కంపెనీలు వేగవంతం చేస్తున్నాయి. […]

Update: 2021-10-03 07:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కేంద్రం డ్రోన్ తయారీ పరిశ్రమల కోసం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న డ్రోన్ తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు తమ ఉత్పత్తుల ఆఫర్లను పెంచుతున్నారు. గత కొంతకాలంగా ఈ పరిశ్రమ వృద్ధి మెరుగ్గా ఉందని, తాజాగా పీఎల్ఐ పథకంతో మరింత వేగవంతంగా గిరాకీ పెరగనున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో డిమాండ్‌కు తగిన స్థాయిలో నియామకాలను కూడా కంపెనీలు వేగవంతం చేస్తున్నాయి. డ్రోన్ తయారీ కంపెనీలైన ఆరవ్ సిస్టమ్స్, ఐడియాఫోర్జ్, గ్రెనె రోబోటిక్స్, స్కైలార్క్ డ్రోన్స్, స్కై ఎయిర్ మొబిలిటీలు గడిచిన ఏడాదిలో తమ అమ్మకాలు 3-5 రెట్లు పెరిగాయని, ఇదే సమయంలో నియామకాలు సైతం అదే స్థాయిలో పెంచుతున్నట్టు వెల్లడించాయి. అనేక అంతర్జాతీయ డ్రోన్ తయారీదారులు సైతం భారత మార్కెట్‌పై దృష్టి పెడుతున్నారని డ్రోన్‌లకు సాఫ్ట్‌వేర్ అందించే స్కైలార్క్ డ్రోన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తిరు రామస్వామి చెప్పారు. మరికొద్ది రోజుల్లో గ్లోబల్ కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్నారు. ఇప్పుడున్న డిమాండ్ తరహాలో వచ్చే ఏడాదిలో 500-600 మంది కొత్తవాళ్లను నిమించుకోనున్నట్టు ప్రముఖ డ్రోన్ సేవల సంస్థ ఆరవ్ సిస్టమ్స్ తెలిపింది.

Tags:    

Similar News