చదువుకుని ఖాళీగా ఉంటున్నారా..? ఈ ఉద్యోగ అవకాశం మీకోసమే

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : రాష్ట్రంలో చదువుకుని ఖాళీగా ఉంటున్న నిరుద్యోగ యువతకు కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ శుభవార్త తెలిపింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండేపల్లి డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ప్లేస్‌ మెంట్‌తో కూడిన లైట్ మోటర్ వెహికిల్, హెవీ డ్యూటీ వెహికిల్ పై డ్రైవింగ్ శిక్షణ ఇచ్చుటకు గిరిజన యువత నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి యమ్. […]

Update: 2021-12-18 04:56 GMT

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : రాష్ట్రంలో చదువుకుని ఖాళీగా ఉంటున్న నిరుద్యోగ యువతకు కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ శుభవార్త తెలిపింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండేపల్లి డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ప్లేస్‌ మెంట్‌తో కూడిన లైట్ మోటర్ వెహికిల్, హెవీ డ్యూటీ వెహికిల్ పై డ్రైవింగ్ శిక్షణ ఇచ్చుటకు గిరిజన యువత నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి యమ్. గంగారాం తెలిపారు. ఈ శిక్షణకు అభ్యర్థులు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయస్సు కలిగి గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆధార్ కార్డ్ కలిగి ఉండాలన్నారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 160 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలని పేర్కొన్నారు.180 రోజుల్లో శిక్షణా కాలం పూర్తి చేస్తామన్నారు.

శిక్షణా కేంద్రంలో 60 రోజులు, జాబ్ ట్రైనింగ్ 30 రోజులు, 90 రోజులు శిక్షణతో కూడిన స్టైఫండ్ అందజేస్తామన్నారు. ఒక సంవత్సరం లైట్ మోటర్ వెహికిల్ లైసెన్సు కలిగి ఉన్న వారికి హెవీ డ్యూటీ వెహికిల్ శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. లేని వారికి లైట్ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. దేశంలో ఎక్కడైనా డ్రైవర్‌గా ఉద్యోగం చేయుటకు సిద్ధంగా ఉండాలని సూచించారు. జగిత్యాల జిల్లాలోని ఆసక్తి గల గిరిజన యువత తమ అర్హతలకు సంబంధించి దరఖాస్తులను ఆన్‌లైన్ వెబ్ సైట్ www.ridessircilla.com నందు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్ నెం. 91-89854 31720, 63020 81792 లను సంప్రదించాలని అధికారి గంగారాం వెల్లడించారు.

Tags:    

Similar News