నదిలో పడిన కారు.. డ్రైవర్ మృతి
దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డుపై ఏర్పడిన గుంతను తప్పించబోయిన కారు ప్రమాదవశాత్తు కాగ్నా నదిలో పడిపోయింది. ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని తాండూరు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి పక్కనే ఉన్న కాగ్నా నదిలో కారు పడిపోయిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళుతున్న వాహనదారులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న […]
దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డుపై ఏర్పడిన గుంతను తప్పించబోయిన కారు ప్రమాదవశాత్తు కాగ్నా నదిలో పడిపోయింది. ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని తాండూరు వద్ద మంగళవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకివెళితే.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి పక్కనే ఉన్న కాగ్నా నదిలో కారు పడిపోయిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళుతున్న వాహనదారులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని వెలితీయగా, అతను యాలాల మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.