వాటర్ లోనే ఉంది హెల్త్ మ్యాటర్

దిశ, వెబ్ డెస్క్ : శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరంలో జరిగే ప్రతీ క్రియకు నీరు అవసరం. బరువు తగ్గాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. మన శరీరంలోని అవయవాలన్నీ వాటి పని అవి సక్రమంగా చేసుకోవాలన్నా నీళ్లెక్కువ తాగితే చాలు. ఎన్నో సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. నీళ్లు తాగితే ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరి తగినంతా నీళ్లు తాగకపోతే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? మన శరీరంలో 70 నుంచి […]

Update: 2020-05-12 00:44 GMT

దిశ, వెబ్ డెస్క్ :
శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరంలో జరిగే ప్రతీ క్రియకు నీరు అవసరం. బరువు తగ్గాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. మన శరీరంలోని అవయవాలన్నీ వాటి పని అవి సక్రమంగా చేసుకోవాలన్నా నీళ్లెక్కువ తాగితే చాలు. ఎన్నో సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. నీళ్లు తాగితే ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరి తగినంతా నీళ్లు తాగకపోతే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

మన శరీరంలో 70 నుంచి 80 శాతం నీరు ఉంటుందని మనందరికీ తెలుసు. ఒక మనిషికి రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీరు అవసరమని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ చాలామంది నీరు తక్కువగా తీసుకుంటుంటారు. ఇది మన శరీరానికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. శ‌రీరం కావాల్సిన నీటిని పొంద‌లేన‌ప్పుడు.. శ‌రీరంలో బాడీ టెంప‌రేచ‌ర్ పెరుగుతుంది. స‌రైన మోతాదులో నీళ్లు తాగితే.. శ‌రీరం కూల్ గా ఉంటుంది.నీటిలో క్లోరిన్‌, ఆక్సిజన్ వంటి వాయువులు సమపాళ్ళలో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాడు. ఒంట్లో నీరు తగ్గితే మెదడు ఆకలి వేస్తుందనే తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. కాబట్టి ఆకలి వేసినప్పుడల్లా ఆహారం కాకుండా నీళ్లు తాగే ప్రయత్నం చేయండి.

ఆలోచన శక్తి తగ్గిపోతుంది :

నీరు శరీరంలోని మలినాలను మూత్ర రూపంలో బయటకు పంపిస్తుంది. తగినంత నీరు తీసుకోకపోతే కిడ్నీ స్టోన్స్, మూత్ర నాళ ఇన్ఫెక్షన్ వస్తాయి. చాలా సయమం వరకు వాటర్ తీసుకోకపోతే ఆలోచన శక్తి తగ్గుతుంది. శరీరంలో నీరు తగ్గినప్పుడు రక్తం కూడా తక్కువ అవుతుంది. దీంతో రక్తనాళాల పనితీరు తగ్గి గుండె వేగం పెరుగుతుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు తగినన్నీ నీల్లు తీసుకోగలిగితే.. మానసిక సామర్థ్యం పెరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది. మన శరీరానికి తగనన్ని నీళ్లు అందకపోవడం వల్ల మనసంతా ఆందోళనగా, విసుగ్గా కూడా ఉంటుంది. ఉదయం ముఖం కడిగిన వెంటనే గ్లాసు మంచినీరు తాగితే.. మలబద్దకం సమస్య తగ్గిపోవడమే కాకుండా జీర్ణకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. నోటి దుర్వాసనకు డీహైడ్రేషన్‌ ఒక కారణం. లాలాజలంలో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. ఎప్పుడైతే నీరు తగ్గుతుందో నోరు పొడిబారి దుర్వాసన వెలువడుతుంది. ఒంట్లో నీరు తగ్గడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. విషయాలను తేలికగా మర్చిపోతూ ఉంటాం.

డీహైడ్రేషన్ :

నీరు తక్కువగా తీసుకోవడం వల్ల చెమట వచ్చినప్పుడు సోడియం,పోటాషియం వంటి ఖనిజ లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు కొన్ని నీళ్లు తాగితే.. శరీరం తేమగా మారుతుంది. డీహైడ్రేషన్‌ కూడా తగ్గుతుంది.

స్కిన్ మెరిసిపోతుంది :

తగినంత నీరు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నాడీ వ్యవస్థలోని చెడు కొవ్వును శుభ్రం చేయాలంటే మన శరీరంలో తగినన్నీ నీళ్లు ఉండాలి. నీటిని తాగడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకుంటే.. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కడుపులో అధిక యాసిడ్స్, ఆమ్లాలు రాకుండా ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంటే దాహం వేయకపోవడం సహజమే! అలాగని నీళ్లు తాగకపోతే జీవక్రియల తీరు మందగిస్తుంది. ఫలితంగా పలు రకాల సమస్యలు వస్తాయి. దాహం వేసినా.. వేయకపోయినా.. నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.

Tags:    

Similar News