స్పెషల్ మాస్క్ రూపొందించిన 'డీఆర్డీఓ'
దిశ, న్యూస్ బ్యూరో: డీఆర్డీఓకు చెందిన రెండు సంస్థలు ఆర్‌సీఐ (హైదరాబాద్), టీబీఆర్ఎల్(చండీగర్) డాక్టర్ల కోసం ఒక ప్రత్యేక ఫేస్ ప్రొటెక్షన్ మాస్క్‌ను రూపొందించాయి. కరోనా బాధితులకు చికిత్సనందించే సమయంలో డాక్టర్లకు వైరస్ సోకకుండా ఈ మాస్క్.. సాధారణ మాస్క్‌ల కంటే బాగా ఉపయోగపడనుందని తెలుస్తోంది. ఈ మాస్క్‌లో ఏ4 సైజు ఓవర్ హెడ్ ప్రొజెక్షన్ ఫిల్మ్, ఈ ఫిల్మ్‌ను పట్టి ఉంచడానికి తయారుచేసిన ఫ్రేమ్ అనే రెండు భాగాలుంటాయి. ఇవి బరువు తక్కువగా ఉండటం వల్ల […]
దిశ, న్యూస్ బ్యూరో: డీఆర్డీఓకు చెందిన రెండు సంస్థలు ఆర్‌సీఐ (హైదరాబాద్), టీబీఆర్ఎల్(చండీగర్) డాక్టర్ల కోసం ఒక ప్రత్యేక ఫేస్ ప్రొటెక్షన్ మాస్క్‌ను రూపొందించాయి. కరోనా బాధితులకు చికిత్సనందించే సమయంలో డాక్టర్లకు వైరస్ సోకకుండా ఈ మాస్క్.. సాధారణ మాస్క్‌ల కంటే బాగా ఉపయోగపడనుందని తెలుస్తోంది. ఈ మాస్క్‌లో ఏ4 సైజు ఓవర్ హెడ్ ప్రొజెక్షన్ ఫిల్మ్, ఈ ఫిల్మ్‌ను పట్టి ఉంచడానికి తయారుచేసిన ఫ్రేమ్ అనే రెండు భాగాలుంటాయి. ఇవి బరువు తక్కువగా ఉండటం వల్ల డాక్టర్లు ఎక్కువసేపు వీటిని ధరించగలుగుతారు. ప్రస్తుతానికి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారైన ఈ మాస్క్‌లు భారీస్థాయిలో తయారవడానికి ఇంజెక్షన్ మౌల్డింగ్ టెక్నాలజీని వాడనున్నారు. హైదరాబాద్ ఆర్‌సీఐ.. స్థానిక ఇఎస్ఐ ఆస్పత్రికి ఈ మాస్క్‌లు అందజేస్తుండగా, టీబీఆర్ఎల్.. చండీగర్‌లోని పీజీఎమ్ఆర్ఐ ఆస్పత్రికి వీటిని అందిస్తోంది.
ఫుల్ బాడీ సానిటైజర్ కూడా..
ఆస్పత్రులు, మాల్స్, థియేటర్స్, ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలకు వెళ్లి వచ్చే వారి కోసం డీఆర్డీఓ ఒక పోర్టబుల్ ఫుల్ బాడీ సానిటైజర్‌ను రూపొందించింది. ఇందులో సోప్, సానిటైజర్ డిస్పెన్సర్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఇందులోకి ప్రవేశించగానే 25 సెకన్ల పాటు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రేచేసి ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. దీనికి ఉన్న ట్యాంకుల్లో.. ఒక్కసారి సోడియం హైపో క్లోరైడ్‌ను నింపితే 600 మందిని సానిటైజ్ చేస్తుంది. డీఆర్డీఓ, దయిూచి హిటాచి అనే కంపెనీతో కలిసి 4 రోజుల్లో ఈ సానిటైజర్ ఉత్పత్తి ప్రారంభించనుంది.
Tags: corona, drdo, doctors, face mask, fullbody sanitiser