కరోనా యాంటీ బాడీలు గుర్తించే కిట్.. మేడిన్ ఇన్ ఇండియా

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలను గుర్తించే కిట్‌ను డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసింది. ఈ కిట్ ద్వారా ఒక వ్యక్తిలో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు కలిగి ఉన్నారా? లేక గతంలో వైరస్‌కు ఎక్స్‌పోజ్ అయ్యారా? అనే విషయాలను సులువుగా గుర్తించవచ్చు. డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలయెడ్ సైన్సెస్, ఢిల్లీకి చెందిన వ్యాన్‌గార్డ్ డయాగ్నిస్టిక్స్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఈ డిప్కోవ్యాన్ కిట్‌ను ఐసీఎంఆర్ ఏప్రిల్‌లోనే ఆమోదించింది. కిట్‌ను తయారుచేసి అమ్మకం, పంపిణీకి […]

Update: 2021-05-21 09:09 GMT

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలను గుర్తించే కిట్‌ను డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసింది. ఈ కిట్ ద్వారా ఒక వ్యక్తిలో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు కలిగి ఉన్నారా? లేక గతంలో వైరస్‌కు ఎక్స్‌పోజ్ అయ్యారా? అనే విషయాలను సులువుగా గుర్తించవచ్చు. డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలయెడ్ సైన్సెస్, ఢిల్లీకి చెందిన వ్యాన్‌గార్డ్ డయాగ్నిస్టిక్స్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఈ డిప్కోవ్యాన్ కిట్‌ను ఐసీఎంఆర్ ఏప్రిల్‌లోనే ఆమోదించింది.

కిట్‌ను తయారుచేసి అమ్మకం, పంపిణీకి డీసీజీఐ కూడా ఈ నెలలోనే ఆమోదం తెలిపింది. వచ్చే నెల తొలివారం నుంచి డిప్కోవ్యాన్ కిట్‌ను వ్యాన్‌గార్డ్ కమర్షియల్‌గా అమ్మనుంది. ధర రూ. 75గా ఉండే అవకాశమున్నట్టు సమాచారం. ఈ కిట్ ద్వారా అంటువ్యాధులకు సంబంధించిన అధ్యయనాలు, సీరో సర్వేలాంటివి చేయడానికి సులువవుతాయి.

Tags:    

Similar News