తాకకుండా శానిటైజేషన్ !
– డీఆర్డీఓ 2 కొత్త పరికరాల తయారీ దిశ, న్యూస్ బ్యూరో : కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దాని కట్టడికి దేశంలోని ప్రతిష్టాత్మక రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ) ఏదో ఒక కొత్త పరికరాన్ని కనిపెడుతూనే ఉంది. ఇప్పటికే మాస్కులు, పలు రకాల పరికరాలను ఆవిష్కరించిన ఆ సంస్థ.. తాజాగా మరో రెండు శానిటైజింగ్ ఉపకరణాలను తయారుచేసింది. ఇందులో ఒకటి మాల్స్, అపార్ట్ మెంట్స్, ఎయిర్ పోర్టు, మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లాంటి […]
– డీఆర్డీఓ 2 కొత్త పరికరాల తయారీ
దిశ, న్యూస్ బ్యూరో : కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దాని కట్టడికి దేశంలోని ప్రతిష్టాత్మక రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ) ఏదో ఒక కొత్త పరికరాన్ని కనిపెడుతూనే ఉంది. ఇప్పటికే మాస్కులు, పలు రకాల పరికరాలను ఆవిష్కరించిన ఆ సంస్థ.. తాజాగా మరో రెండు శానిటైజింగ్ ఉపకరణాలను తయారుచేసింది. ఇందులో ఒకటి మాల్స్, అపార్ట్ మెంట్స్, ఎయిర్ పోర్టు, మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లాంటి ప్రదేశాల్లో ఇన్‌స్టాల్ చేసుకునే కాంటాక్ట్‌లెస్ శానిటైజింగ్ డిస్పెన్సర్ కాగా.. మరొకటి యూవీ కిరణాలతో వైరస్‌ను చంపే పెట్టె. వీటిలో గోడకు ఫిక్స్ చేసుకునే విధంగా ఉండే కాంటాక్ట్‌లెస్ డిస్పెన్సర్ ఆల్కహాల్‌తో తయారైన రబ్ శానిటైజర్‌ను స్ప్రే చేస్తుంది. ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్స్‌ను కలిగి ఉండటం వల్ల శానిటైజ్ చేసుకునేందుకు దీన్ని ముట్టుకోవాల్సిన పని లేదు. చేతులు దాని వద్ద పెట్టగానే ఒక్కసారిగా శానిటైజర్‌ను చిన్న చిన్న తుంపర్లలాగా వెదజల్లుతుంది. 5 నుంచి 6 మిల్లీలీటర్ల శానిటైజర్‌ను 12 సెకన్ల పాటు బయటికి వదులుతుంది. అర చేతి నుంచి మోచేయి దాకా మొత్తం చేతులను ఇది శానిటైజ్ చేస్తుంది. చేతితో తాకే అవసరం లేకపోవడంతో దీనిని కరోనా ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాల్లోనూ వాడుకోవచ్చని డీఆర్డీఓ తెలిపింది.
కెమికల్స్ తో పనిలేని యూవీ – సీ బాక్స్..
అతినీలలోహిత(యూవీ) కిరణాల ఆధారంగా పనిచేసే చేత్తో పట్టుకొని తీసుకు వెళ్లగల చిన్న సూట్‌కేసు లాంటి శానిటైజర్‌ను డీఆర్డీఓ తయారు చేసింది. ఇవి 254 నానోమీటర్ల వేవ్ లెన్త్ కలిగిన యూవీ – సీ కిరణాలను ప్రసరింపజేసి వైరస్‌లోని ఆర్ఎన్‌ఏను నాశనం చేస్తుంది. దీంతో వైరస్ పునరుత్పత్తి ఆగిపోతుంది. ఈ పరికరంతో మొబైల్ ఫోన్లు, ఆఫీసు ఫైళ్లు, కరెన్సీ నోట్లు, ట్యాబ్లెట్లు వంటి రెగ్యులర్‌గా వాడే వాటిని ఏ రకమైన రసాయనాలు అవసరం లేకుండా శానిటైజ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్‌లో ఉన్న 8 వాట్ల లైట్‌ను బయటికి తీసి రెండు ఇంచుల దూరంలో ఉంచి యూవీ కిరణాలు ప్రసరింపజేయడం ద్వారా ఆఫీసులోని కుర్చీలు, టేబుళ్లు, ఫుడ్ పార్సిళ్లు వంటి వాటిని వైరస్ రహితంగా మార్చుకోవచ్చు. ఇది ఆఫీసులను వైరస్ రహితంగా మార్చుకొని కార్యకలాపాలు కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది.
Tags : drdo, invention, dispenser, uv-c box, sanitisation