రసాభాసగా డీఆర్సీ సమావేశం
దిశ, ఏపీబ్యూరో : తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి సమావేశం రసాభాసగా ముగిసింది. సోమవారం నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో అధికార పార్టీ నేతలు పరస్పర దూషణలకు దిగారు. కాకినాడ టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగిందని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఒకే పార్టీలో ఉంటూ తనకు చెప్పాలి కదా అంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ దుర్భాషలాడారు. మేడ లైన్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు వల్లే కాకినాడ మునిగిపోయిందంటూ మరోసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ […]
దిశ, ఏపీబ్యూరో : తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి సమావేశం రసాభాసగా ముగిసింది. సోమవారం నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో అధికార పార్టీ నేతలు పరస్పర దూషణలకు దిగారు. కాకినాడ టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగిందని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఒకే పార్టీలో ఉంటూ తనకు చెప్పాలి కదా అంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ దుర్భాషలాడారు.
మేడ లైన్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు వల్లే కాకినాడ మునిగిపోయిందంటూ మరోసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి మరింత రెచ్చిపోయారు. తనకు చెప్పాలి కదా అంటూ ఆవేశంతో ఊగిపోయారు.ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పపై కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడికి మంత్రి కన్నబాబు, సహచర ఎమ్మెల్యేలు నచ్చజెప్పడంతో గొడవ సర్దుమనిగింది.