థర్డ్ పార్టీ ఒప్పందాలు లేవు.. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌పై రెడ్డీస్ క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో : రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ సరఫరాపై భారత్‌కు చెందిన రెడ్డీస్ లాబ్ స్పష్టత ఇచ్చింది. అధికారికంగా జూన్ మధ్యలో లాంచింగ్ ఉంటుందని, తొలి దశలో సుమారు పాతిక కోట్ల డోసులను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ థర్డ్ పార్టీ ఒప్పందాలు ఏవీ చేసుకోలేదని, తయారీపై కూడా ఏ సంస్థకూ అనుమతి ఇవ్వలేదని, పూర్తి హక్కులు రెడ్డీస్ లాబ్ దగ్గరే ఉన్నట్లు రష్యాకు చెందిన ‘రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‘ ఆ టీకాను […]
దిశ, తెలంగాణ బ్యూరో : రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ సరఫరాపై భారత్‌కు చెందిన రెడ్డీస్ లాబ్ స్పష్టత ఇచ్చింది. అధికారికంగా జూన్ మధ్యలో లాంచింగ్ ఉంటుందని, తొలి దశలో సుమారు పాతిక కోట్ల డోసులను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ థర్డ్ పార్టీ ఒప్పందాలు ఏవీ చేసుకోలేదని, తయారీపై కూడా ఏ సంస్థకూ అనుమతి ఇవ్వలేదని, పూర్తి హక్కులు రెడ్డీస్ లాబ్ దగ్గరే ఉన్నట్లు రష్యాకు చెందిన ‘రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‘ ఆ టీకాను భారత్‌లో పంపిణీ చేయనున్న రెడ్డీస్ లాబ్ సంయుక్తంగా తెలిపాయి. టీకాలను దిగుమతి చేసుకోవడం, నిల్వ చేసుకోవడం, కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటు, పంపిణీ తదితరాలన్నింటిపై పనులు జరుగుతున్నాయని తెలిపాయి.
టీకాల సరఫరాకు సంబంధించి ప్రభుత్వంతో, ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయని, ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నాయి. భారత్‌లోనే టీకాలను ఉత్పత్తి చేసేలా కొన్ని సంస్థలతో తయారీ ఒప్పందాలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయని, కానీ అందులో వాస్తవం లేదని స్పష్టం చేశాయి. థర్డ్ పార్టీలతోగానీ, రెసిడెన్షియల్ సంఘాలతోగానీ ఎలాంటి ఒప్పందాలు జరగలేదని, ఆ తీరులో సరఫరా చేయడానికి ఏజెంట్లను నియమించుకోలేదని క్లారిటీ ఇచ్చాయి. కానీ కొన్ని సంస్థలకు హక్కులను ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయని, ఇందుల నిజం లేదని తెలిపాయి.
దేశంలో వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌పైన చాలా నమ్మకాలే ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి లేకపోయినా విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ డోసులు సరిపోయేంత స్థాయిలో లేనందువల్ల స్పుత్నిక్-వి ఆ కొరతను తీరుస్తుందని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించడం కూడా ఇందులో భాగం. అయితే ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్తున్న రెడ్డీస్ లాబ్ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గ్లోబల్ టెండర్లలో పాల్గొని టీకాలను సరపరా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం.