డీపీఎల్ మ్యాచ్ అఫీషియల్స్‌కు గాయాలు

దిశ, స్పోర్ట్స్: ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో మరో వివాదం చోటు చేసుకున్నది. డీపీఎల్‌లో మ్యాచ్ అఫీషియల్స్‌గా వ్యవహరిస్తున్న ఇద్దరు రిఫరీలు, ఆరుగురు అంపైర్లు ఒక వాహనంలో వెళ్తుండగా ఒక నిరసన కార్యక్రమం మధ్యలో ఇరుక్కొని పోయారు. చేనేత కార్మికులు ఢాకాలోని సవర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆందోళన నిర్వహిస్తుండగా పోలీసులు వారికి చెదరగొట్టడానికి లాఠీ చార్జి చేశారు. అదే సమయంలో వీళ్లు ప్రయాణిస్తున్న వాహనం అక్కడకు చేరుకున్నది. ఆందోళనకారుల దాడిలో వారి వాహనం ధ్వంసం అయ్యింది. ఈ […]

Update: 2021-06-13 11:00 GMT

దిశ, స్పోర్ట్స్: ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో మరో వివాదం చోటు చేసుకున్నది. డీపీఎల్‌లో మ్యాచ్ అఫీషియల్స్‌గా వ్యవహరిస్తున్న ఇద్దరు రిఫరీలు, ఆరుగురు అంపైర్లు ఒక వాహనంలో వెళ్తుండగా ఒక నిరసన కార్యక్రమం మధ్యలో ఇరుక్కొని పోయారు. చేనేత కార్మికులు ఢాకాలోని సవర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆందోళన నిర్వహిస్తుండగా పోలీసులు వారికి చెదరగొట్టడానికి లాఠీ చార్జి చేశారు. అదే సమయంలో వీళ్లు ప్రయాణిస్తున్న వాహనం అక్కడకు చేరుకున్నది.

ఆందోళనకారుల దాడిలో వారి వాహనం ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో రిఫరీలు దేబబ్రత పాల్, ఆదిల్ అహ్మద్, అంపైర్లు షఫియుద్దీన్, తన్వీర్ అహ్మద్, అబ్దుల్లా అల్ మాటిన్, ఇమ్రాన్ పర్వేజ్, బర్కతుల్లా టర్కీ, షొహ్రబ్ హొస్సేన్‌లు ఈ ఘటనలో ఇరుక్కొని పోయారు, దీంతో శనివారం జరగాల్సిన మ్యాచ్‌లు అరగంట ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కొంత మంది అఫిషియల్స్‌కు స్వల్ప గాయాలు కూడా అయినట్లు సమాచారం. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం వారు మ్యాచ్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తున్నది.

Tags:    

Similar News