కరోనా.. శృంగారాన్ని చేయనీయట్లే..
దిశ, న్యూస్ బ్యూరో: మనిషి శారీరక ఆరోగ్యానికి, వారి శృంగార జీవనానికి నేరుగా సంబంధాలు ఉన్నాయని అనేక పరిశోధనలు స్పష్టం చేశాయి. వయసు మళ్లిన వారిలో గుండెపోటు రాకుండా నిరోధించడంలోనూ సెక్స్ కీలక పాత్ర పోషిస్తుందని నిరూపించబడింది. తరచుగా శృంగారంలో పాల్గొనే వారిలో ఎలాంటి మానసిక సమస్య తలెత్తదు. దాంతో పాటు మెదడు చురుకుగా ఉండేందుకు దోహదపడుతుంది. లాక్‌డౌన్ సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో శృంగార కార్యకలాపాలపై నిర్వహించిన సర్వేలో విస్తుపోయేలా ఫలితాలొచ్చాయి. ఈ సమయంలో జంటలు అతి […]
దిశ, న్యూస్ బ్యూరో: మనిషి శారీరక ఆరోగ్యానికి, వారి శృంగార జీవనానికి నేరుగా సంబంధాలు ఉన్నాయని అనేక పరిశోధనలు స్పష్టం చేశాయి. వయసు మళ్లిన వారిలో గుండెపోటు రాకుండా నిరోధించడంలోనూ సెక్స్ కీలక పాత్ర పోషిస్తుందని నిరూపించబడింది. తరచుగా శృంగారంలో పాల్గొనే వారిలో ఎలాంటి మానసిక సమస్య తలెత్తదు. దాంతో పాటు మెదడు చురుకుగా ఉండేందుకు దోహదపడుతుంది.
లాక్‌డౌన్ సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో శృంగార కార్యకలాపాలపై నిర్వహించిన సర్వేలో విస్తుపోయేలా ఫలితాలొచ్చాయి. ఈ సమయంలో జంటలు అతి తక్కువగా శృంగార కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఈ సర్వే నిర్థారించింది. ఇందుకు ప్రధానంగా ఈ కరోనా మహమ్మారి సమయంలో ఏర్పడిన విపరీతమైన ఒత్తిడి, ఆందోళన కారణమని తేలింది. శృంగారం పట్ల విముఖత ఏర్పడిందని పెళ్లైన జంటలే అన్నాయని కొండాపూర్ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి యూరాలజిస్టు అండ్ ఆండ్రాలజిస్టు డా.ప్రియాంక సక్లేచా అన్నారు. కారణాలెన్నైనా శృంగార సమయాల్లో విడుదలయ్యే ఎండార్ఫిన్ అనబడే హార్మోన్ మనిషిలో ఏర్పడే ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుందని పరిశోధనలు స్పష్టం చేశాయి.
వారానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు శృంగారంలో పాల్గొనే జంటలు ఆందోళన, ఒత్తిళ్ల నుంచి సులభంగా అధిగమించగలుతారని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ స్కాట్ లాండ్ పరిశోధనలో తేలినట్లు చెప్పారు. దీంతో పాటు మహమ్మారి కారణంగా ఏర్పడే అనూహ్య పరిస్థితుల నుంచి దృష్టి మరల్చుకోవడానికి సెక్స్ ఒక మంచి కారణం. కానీ అది అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయడుతున్నారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మునిగి తేలుతూ బిజీ జీవనాన్ని గడిపిన పలువురు దంపతులకు ఇపుడు దొరికిన సామీప్యత కారణంగా గతంలో కన్నాఎక్కువగా వీరు శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారని భావించినా సామాజిక దూర నిబంధనల కారణంగా అదంతగా సాగడం లేదని భావించవచ్చన్నారు. జంటలో ఎవరైనా ఒకరికి దీనిపై ఆసక్తి లేకపోవడం పరిస్థితిని పూర్తిగా మార్చి వేస్తుందన్నారు. మహిళల కన్నా పురుషులే శృంగారంపై ఆసక్తి చూపడం లేదన్నారు.
సేఫ్ సెక్స్ గైడ్ లైన్స్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనూ మంచి శృంగార జీవనాన్నిఆస్వాదించడానికి హార్వర్డ్ మెడికల్ స్కూల్, అమెరికన్ సెక్సువల్ హెల్త్ అసోసియేషన్ సంయుక్తంగా సేఫ్ సెక్స్ గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. మహమ్మారి కాలంలోనూ ఇబ్బందులు లేని సంతోషకరమైన శృంగార జీవనాన్ని సాగించవచ్చని సూచిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున మహమ్మారి ఉన్న సమయంలోనూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే ఆందోళన, ఒత్తిడి నుండి మనల్ని దూరంగా ఉంచే శృంగార కార్యాన్ని కొనసాగించడానికి కొంత మేర జంటలు సరికొత్త ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని డా.ప్రియాంక సక్లేచా సూచించారు. కొత్త వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనవద్దు. శృంగారంలో పాల్గొనాలనుకుంటే ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. ఏదైనా సమస్య తలెత్తినా, అనారోగ్యంగా అనిపించినా వెంటనే డాక్టరును సంప్రదించాలి. అవసరం లేని గర్భాన్ని వదిలించుకోవడం కంటే ముందస్తు జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరమన్నారు. కరోనా వైరస్ కట్టడి పూర్తయ్యే వరకు ఇతరులతో భౌతికదూరం పాటించడం మర్చిపోవద్దన్నారు.